Special Entry in Army: ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా 55 పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా నియామకాలు
- ఎన్‌సీసీ పట్టభద్రులకు అవకాశం
- ఇంటర్వ్యూ ద్వారా నియామకాలు
గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థుల కోసం ఇండియన్ ఆర్మీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా 55 పోస్టులను భర్తీ చేయనుంది. మహిళలు సహా అవివాహిత పట్టభద్రులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా శిక్షణకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు మంచి హోదాతోపాటు ఆకర్షణీయ వేతనాలు పొందవచ్చు.
- మొత్తం పోస్టుల సంఖ్య: 55(వీటిలో 50 పురుషులకు, 5 మహిళలకు). ఈ రెండు విభాగాల్లోనూ 6 పోస్టులు(పురుషులకు 5, మహిళలకు1) యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు కేటాయించారు.
ఎన్‌సీసీ ఎంట్రీ స్కీమ్
ఇండియన్ ఆర్మీ.. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఏడాదికి రెండుసార్లు ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తోంది.
అర్హతలు
కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మూడు అకడమిక్ సంవత్సరాలు ఎన్‌సీసీ సీనియర్ వింగ్‌లో కొనసాగి ఉండాలి. ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌లో కనీసం బి గ్రేడ్ పొంది ఉండాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సీసీ సి సర్టిఫికెట్ అవసరం లేదు.
వయసు
01.01.2024 నాటికి 19-25 ఏళ్ల మధ్య ఉండాలి. జనవరి 02,1999-జనవరి 1 2005 మ«ధ్య జన్మించినవారు మాత్రమే అర్హులు.
ఎంపిక ఇలా
వచ్చిన దరఖాస్తులను వారి అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇలా వడపోతలో నిలిచినవారికి సెలక్షన్ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు బెంగళూరులో ఇంటర్వ్యూలు ఉంటాయి. సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్‌ల ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. రెండు దశల్లో అయిదు రోజులపాటు ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. మొదటి రోజు స్టేజ్-1లో అర్హత సాధించిన వారిని మాత్రమే ఆ తర్వాత 4 రోజులపాటు నిర్వహించే స్టేజ్-2 ఇంటర్వ్యూకు అనుమతిస్తారు. స్టేజ్-2లో విజయం సాధించిన వారికి మెడికల్ టెస్టులు నిర్వహించి శిక్షణలోకి తీసుకుంటారు.
శిక్షణ-వేతనాలు
ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి ఆఫీసర్ ట్రైయినింగ్ అకాడెమీ, చెన్నైలో 49 వారాల «శిక్షణ ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో ప్రతి నెల రూ.56,100 స్టైపెండ్ అందిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మాద్రాస్ యూనివర్సిటీ ప్రధానం చేస్తుంది. వీరిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఇలా పదేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం ఆర్మీ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల మేçరకు కొందరిని పర్మనెంట్ కమిషన్‌లోకి (శాశ్వత ఉద్యోగం) తీసుకుంటారు. మిగిలిన వారికి మరో నాలుగేళ్ల పాటు సర్వీస్ పొడిగిస్తారు. అనంతరం వైదొలగాల్సి ఉంటుంది.
పదోన్నతులు ఇలా
లెఫ్టినెంట్‌గా విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల అనుభవంతో మేజర్, 13 ఏళ్ల అనుభవంతో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలకు చేరుకోవచ్చు. విధుల్లో చేరిన వారికి ప్రతి నెల రూ.56,100 మూలవేతనంతోపాటు మిలిటరీ సర్వీస్ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు లభిస్తాయి. మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనంగా అందుకోవచ్చు. ఇతర ప్రోత్సాహకాలు పొందవచ్చు.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తులకు చివరి తేదీ: 03.08.2023
- వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in/
చదవండి: Indian Air Force Recruitment 2023: భారత వాయుసేనలో అగ్నివీర్ నియామకాలు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 03,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |