Jobs in Indian Navy: ఇంటర్ అర్హతతో 2500 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
ఇండియన్ నేవీ సెయిలర్ (ఏఏ–ఎస్‌ఎస్‌ఆర్).. ఆగస్ట్ 2022 బ్యాచ్ కోసం సెయిలర్ పోస్టుల భర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 2500
పోస్టుల వివరాలు: ఏఏ(ఆర్టిఫీషర్ అప్రెంటిస్)–500, ఎస్‌ఎస్‌ఆర్(సీనియర్ సెకండరీ
రిక్రూట్స్)–2000.
అర్హత: 60 శాతం లేదా ఆపైన మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2) ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: 2002 ఆగస్ట్ 1 నుంచి 2005 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.
జీతం: ట్రైనింగ్ పీరియడ్‌లో స్టైపెండ్ కింద నెలకి రూ.14,600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు లెవల్ 3(డిఫెన్స్ పే) కింద నెలకు రూ.21,700 నుంచి రూ.69,100.. అదనంగా ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్మీడియట్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చే సిన అభ్యర్థుల్ని రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్(పీఎఫ్‌టీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 29.03.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.04.2022
వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in
చదవండి: Jobs In Indian Coast Guard: సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివరాలు ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | April 05,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |