Indian Navy Recruitment 2023: ఇంటర్‌తో నేవీలో 1365 అగ్నివీర్ పోస్టులు.. రాత పరీక్ష ప్రిపరేషన్ ఇలా..
- అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.
- మొత్తం పోస్టుల సంఖ్య: ఎస్‌ఎస్‌ఆర్–1365(మహిళలకు 273),ఎంఆర్–100(మహిళలకు–20)
అర్హత
- అగ్నివీర్(ఎస్‌ఎస్‌ఆర్) పోస్టులకు దరఖాస్తుకు ఇంటర్మీడియట్/10+2లో ఉత్తీర్ణులై ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి సబ్జెక్టులతోపాటు కెమిస్ట్రీ/బయాలజీ /కంప్యూటర్‌ల్లో ఏదైనా ఒక సబ్జెక్టు చదివి ఉండాలి.
- అగ్నివీర్(ఎంఆర్): పదోతరగతి ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు.
- వయసు: 17 1/2 నుంచి 21ఏళ్ల లోపు ఉండాలి. నవంబర్ 01, 2002 నుంచి ఏప్రిల్ 30, 2006 మధ్య జన్మించి ఉండాలి.
ఎత్తు
అన్ని విభాగాలకు పురుషులు 157 సెం.మీ., మహిళలు 152 సెం.మీ ఉండాలి. ఎత్తుకు తగిన బరువు అవసరం. ఊపిరి పీల్చినప్పుడు, వదిలినప్పుడు ఛాతీ వ్యత్యాసం 5 సెం.మీ. ఉండాలి.
ఎంపిక ఇలా
ఎంపిక ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. రాత పరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఈ మూడింటిలో అర్హత సాధించిన వారినే తుదిగా ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.
చదవండి: Naval Dockyard Recruitment 2023: నావల్ డాక్‌యార్డ్‌లో 281 అప్రెంటిస్‌లు
ఎస్‌ఎస్‌ఆర్ అర్హత పరీక్షలు
- ఈ పోస్టులకు సంబంధించి రెండు స్టేజ్‌లుగా అర్హత పరీక్షలు నిర్వహిస్తారు. స్టేజ్–1 రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి మాత్రమే స్టేజ్–2 రాత పరీక్ష, మెడికల్ టెస్టులకు అనుమతిస్తారు. స్టేజ్ 1కు సంబంధించిన రాత పరీక్ష, సిలబస్ వివరాలు ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
- స్టేజ్–1: ఈ పరీక్ష ఆన్‌లైన్(సీబీటీ) విధానంలో 100 ప్రశ్నలు–100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్ అవేర్‌నెస్.. ఇలా నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కును కేటాయిస్తారు. పొరపాటుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు చొప్పున కోతవేస్తారు. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీలో ఉంటాయి. ప్రతి విభాగంలో కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి.
ఎంఆర్ రాత పరీక్ష
ఈ పరీక్షను ఆన్‌లైన్(సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ రెండు విభాగాల నుంచి 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి స్టేజ్–2 పరీక్షలుంటాయి. వీరికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు, మెడికల్, ట్రైనింగ్ తదితర అన్ని నిబంధనలు అగ్నివీర్(ఎస్‌ఎస్‌ఆర్) మాదిరిగానే ఉంటాయి.
ఫిజికల్ టెస్టులు
- మొదటి దశ రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఫిజికల్ టెస్టులకు ఎంపికైన వారు నిర్దేశిత సెలక్షన్ కేంద్రాలకు అవసరమైన సర్టిఫికేట్లతో హాజరవ్వాలి.
- ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టులో భాగంగా 1.6 కిలోమీటర్ల దూరాన్ని పురుషులు 7 నిమిషాలు, మహిళలు 8 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే పురుషులు 20, మహిళలు 15 గుంజీలు తీయగలగాలి. పురుషులు 12 పుషప్స్, మహిళలు 10 సీట్‌అప్‌లు తీయగలగాలి. వీటిలో అర్హత సాధించిన వారికి మాత్రమే మెడికల్ టెస్టులను నిర్వహిస్తారు. మెడికల్ టెస్టులోనూ అర్హత సాధించిన వారికి తుది ఎంపికగా చేసి ఐఎన్‌ఎస్ చిల్కాలో శిక్షణ ఇస్తారు.
రాత పరీక్ష ప్రిపరేషన్ ఇలా
సిలబస్ 10+2 సీబీఎస్‌ఈ స్థాయిలో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు సంబ«ంధిత టాపిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి. సరైన ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలి. మాక్ టెస్టులు రాయడం ద్వారా టైమ్ మేనేజ్‌మెంట్ అలవడుతుంది. చేస్తున్న పొరపాట్లు తెలుస్తాయి. ఇంగ్లిష్‌కు సంబంధించి వ్యాకరణంపై పట్టు సాధించాలి. మేథమెటికల్ విభాగంలో మాది రి ప్రశ్నలు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించి తాజాగా రక్షణ శాఖలో తీసుకొచ్చిన నూతన సాంకేతికత, సంభవించిన కీలక పరిణామాలపై దృష్టిపెట్టాలి. వీటితోపాటు స్పోర్ట్స్, అవార్డ్స్, బుక్స్, ఎన్నికలు తదితర తాజా సమకాలీనాంశాలపై అవగాహన మేలు చేస్తుంది.
సేవానిధి
ప్రతినెల అగ్నివీరులు అందుకునే మొత్తంలో 30 శాతం కార్పస్ ఫండ్(సేవా నిధి)కి జమచేస్తారు. మొదటి ఏడాది ప్రతి నెల రూ.30 వేలు వేతనంగా పొందితే.. అందులో రూ.9 వేలు సేవానిధిలో జమ అవుతుంది. రెండో ఏడాది రూ.33,000 వేతనంగా అందుతుంది. ఇందులో నుంచి రూ.9900 నిధికి జమవుతుంది. అలాగే మూడో ఏడాది రూ.36,500 వేతనం లభిస్తుంది. ఇందులో నుంచి రూ.10,950 నిధికి జమచేస్తారు. ఇలా నాలుగో ఏడాదికి వచ్చేసరికి అగ్నివీరుని రూ.40000 వేతనంలో రూ.12,000 సేవా నిధికి వెళ్తాయి. మొత్తం నాలుగేళ్ల కాలానికి సేవా నిధిలో రూ.5.02 లక్షలు అగ్నివీరుని వేతనం నుంచి జమవుతాయి. అంతేమొత్తాన్ని ప్రభుత్వమూ జమచేస్తుంది. రెండూ కలిపి రూ.10.04 లక్షలవుతాయి. దీనికి వడ్డిని కలిపి నాలుగేళ్ల అనంతరం అందజేస్తారు. నాలుగేళ్ల సర్వీస్‌లో మధ్యలో కావాలంటే.. వైదొలిగే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సందర్భంలో వేతనం నుంచి జమ అయిన మొత్తాన్ని అగ్నివీరులకు అందిస్తారు. ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహం మాత్రం వీరికి దక్కదు.
ఇతర ప్రయోజనాలు
అగ్నివీరులకు 30 వార్షిక సెలవులు లభిస్తాయి. ఆరోగ్య సమస్యలను బట్టి సిక్‌లీవ్‌లు కూడా ఇస్తారు. నాలుగేళ్ల సర్వీస్ కాలంలో రిస్క్ అండ్ హార్డ్‌షిప్, రేషన్, డ్రెస్, ట్రావెల్ అలవెన్సులు అందిస్తారు. నాలుగేళ్ల పాటు రూ.48 లక్షలకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ వర్తిస్తుంది. నాలుగేళ్ల సేవలకు గాను వారు పనిచేసిన విభాగాన్ని అనుసరించి అగ్నివీర్‌సర్టిఫికేట్ అందుతుంది. వీరికి ఫించను, గ్రాట్యుటీ, కరవు భత్యం, మిలటరీ సర్వీస్ పే(ఎంఎస్‌పీ), ఎక్స్‌సర్వీస్‌మెన్ హోదా వంటివి వర్తించవు. ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఉండదు.
చదవండి: Indian Navy Recruitment 2023: 1365 అగ్నివీర్(ఎస్‌ఎస్‌ఆర్) పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తులకు చివరి తేదీ: 2023, జూన్ 15
- వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/
Qualification | 12TH |
Last Date | June 15,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |