Indian Navy Recruitment 2023: 1365 అగ్నివీర్(ఎస్‌ఎస్‌ఆర్) పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 1365(పురుషులు-1120, మహిళలు-273).
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్‌లో ఏదో ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అభ్యర్థి 01.11.2002 నుంచి 31.04.2005 మధ్యలో జన్మించి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాతపరీక్ష, శారీరక దారుఢ్యపరీక్ష(పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
శిక్షణ: అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్ చిల్కాలో వచ్చే ఏడాది నవంబర్ 2023లో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు కేటాయిస్తారు.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.35,550, నాలుగో ఏడాది రూ.40,000 ఉంటుంది.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష.
ప్రశ్నపత్రం హిందీ/ఇంగ్లిష్ భాషల్లో మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 100మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమేటిక్స్, జనరల్ అవేర్‌నెస్ నాలుగు విభాగాల్లో ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు నేవీ అ«ధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.06.2023.
శిక్షణ ప్రారంభం: 2023 నవంబర్ నెలలో
వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | June 15,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |