Skip to main content

Indian Army Recruitment 2022: ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌.. ఎంపిక విధానం ఇలా..

Indian Army Recruitment

ఇండియన్‌ ఆర్మీ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్లుగా చేరేందుకు ఎన్‌సీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌ 52వ కోర్సు(అక్టోబర్‌ 2022) నోటిఫికేషన్‌ విడుదలచేసింది. అవివాహిత పురుషులు, మహిళలు వీటికి అర్హులు.

మొత్తం ఖాళీల సంఖ్య: 55
ఖాళీల వివరాలు: ఎన్‌సీసీ మెన్‌–50, ఎన్‌సీసీ ఉమెన్‌–05.
ఎన్‌సీసీ మెన్‌: (జనరల్‌ కేటగిరి–45, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి–05)
ఎన్‌సీసీ ఉమెన్‌: (జనరల్‌ కేటగిరి–04,  యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి–01)
అర్హత: కనీసం 50శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితో పాటు ఎన్‌సీసీ ‘సీ’ సర్టిఫికేట్‌ ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి కనీసం 50శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వీరికి ఎన్‌సీసీ సీ సర్టిఫికేట్‌ ఉండాల్సిన అవసరం లేదు.
వయసు:ఎన్‌సీసీ అభ్యర్థులకు(యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందిని కలుపుకొని) 01.06.2022నాటికి 19–25 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులను మొదట షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారికి ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇది రెండు ఫేజ్‌లుగా ఉంటుంది. ఫేజ్‌–1,ఫేజ్‌–2 పరీక్షలు ఉంటాయి. ఫేజ్‌–1లో ఫెయిల్‌ అయిన అభ్యర్థులను ఫేజ్‌–2కి ఎంపికచెయ్యరు. ఫేజ్‌–1లో ఎంపికైన అభ్యర్థులకు ఫేజ్‌–2 ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో ఎంపికైన వారికి చివరిగా మెడికల్‌ టెస్ట్‌ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.04.2022

వెబ్‌సైట్‌: http://www.joinindianarmy.nic.in/

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification GRADUATE
Last Date April 13,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories