Skip to main content

Indian Army Recruitment 2022: ఆర్మీ, ఏఎస్‌సీ సెంటర్లలో 458 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

Indian Army ASC Centre Recruitment 2022 for 458 Vacancies

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ, ఇండియన్‌ ఆర్మీకి చెందిన ఉత్తర, దక్షిణ ఏఎస్‌సీ సెంటర్లు వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 458
పోస్టుల వివరాలు: ఏఎస్‌సీ సెంటర్‌(దక్షిణం)– 209, ఏఎస్‌సీ సెంటర్‌(ఉత్తరం) –249.
ఏఎస్‌సీ సెంటర్‌(దక్షిణం): 
పోస్టులు: కుక్, సివిలియన్‌ కేటరింగ్‌ ఇన్‌స్ట్రక్టర్, ఎంటీఎస్, టిన్‌ స్మిత్, బార్బర్, క్యాంప్‌ గార్డ్‌ తదితరాలు.

ఏఎస్‌సీ సెంటర్‌(ఉత్తరం): 
పోస్టులు: స్టేషన్‌ ఆఫీసర్లు,ఫైర్‌మెన్లు, ఫైర్‌ ఇంజిన్‌ డ్రైవర్లు,ఫైర్‌ ఫిట్టర్, సివిలియన్‌ మోటార్‌ డ్రైవర్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి/తత్సమాన, ఇంటర్మీడియట్, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో అనుభవం ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి. 
వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష,స్కిల్‌ టెస్ట్‌/ఫిజికల్‌ టెస్ట్‌/ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షని మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ప్రిసైడింగ్‌ ఆఫీసర్, సివిలియన్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, ఏఎస్‌సీ సెంటర్‌(దక్షిణం)–2 ఏటీసీ, అగ్రం పోస్టు, బెంగళూరు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://indianarmy.nic.in

 

చ‌ద‌వండి: Indian Airforce Agniveer Recruitment 2022‌: ఐఏఎఫ్‌–అగ్నివీర్‌ వాయు ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Experience Fresher job
For more details, Click here

Photo Stories