Indian Airforce Agniveer Recruitment 2022: ఐఏఎఫ్–అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్)అగ్నిఫథ్ స్కీమ్ ద్వారా అగ్నివీర్ వాయు ఇన్‌టేక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఐఏఎఫ్–అగ్నివీర్ వాయు పోస్టులు:
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2)/మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 23 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: మొదటి ఏడాది నెలకు రూ.30,000, రెండో ఏడాది నెలకు రూ.33,000, మూడో ఏడాది నెలకు రూ.36,500, నాలుగో ఏడాది నెలకు రూ.40,000+వర్తించే అలవెన్సులు అందజేస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్(ఫేజ్–1, ఫేజ్–2), ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 24.06.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.07.2022
పరీక్ష తేది: 24.07.2022 నుంచి
వెబ్‌సైట్: https://www.careerindianairforce.cdac.in
చదవండి: Apprentice Jobs: ఇండియన్ నేవీలో 338 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | July 05,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |