Administrative Officer Posts: బీమా సంస్థ... న్యూ ఇండియా అష్యూరెన్స్‌లో 300 ఆఫీసర్ పోస్టులు
భారత ప్రభుత్వానికి చెందిన బీమా సంస్థ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. ఇటీవల 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(ఏఓ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పోటీపడవచ్చు. ఆసక్తి గల వారు సెప్టెంబర్ 21తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం
ఏఓ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష మొత్తం ఐబీపీఎస్ పీవో తరహాలో ఉంటుంది. బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
ప్రిలిమినరీ పరీక్ష
- ఆన్‌లైన్ విధానంలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం మూడు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్–30 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ–35 మార్కులకు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 35 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 15రెట్ల మందిని మెయిన్‌కు అనుమతిస్తారు.
మెయిన్ పరీక్ష
- ఈ పరీక్ష ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్.. రెండు విధానాల్లో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ పరీక్ష 200 మార్కులకు, డిస్క్రిప్టివ్ పరీక్ష 30 మార్కులకు ఉంటుంది. ఈ రెండు టెస్టులు కూడా ఆన్‌లైన్ వి«ధానంలోనే జరుగుతాయి.
- మెయిన్ ఆబ్జెక్టివ్ పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్–50 మార్కులకు, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్–50 మార్కులకు, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్–50 మార్కులకు, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్–50 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఆబ్జెక్టివ్ తరహ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల డిస్క్రిప్టివ్ పరీక్ష పేపర్లను మాత్రమే మూల్యాంకనం చేస్తారు.
- డిస్క్రిప్టివ్ పద్ధతిలో 30 మార్కులకు జరిగే పరీక్షలో ఇంగ్లిష్ నైపుణ్యాన్ని పరీక్షించేలా లెటర్ రైటింగ్ పది మార్కులకు, ఎస్సె 20 మార్కులకు ఉంటాయి. మెయిన్‌లో ప్రతిభ చూపిన వారిని మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2021.
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: అక్టోబర్ 2021
మెయిన్ పరీక్ష తేదీ: నవంబర్ 2021
వెబ్‌సైట్: https://www.newindia.co.in/portal/
Qualification | 12TH |
Last Date | September 21,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |