JEE-Main 2023: జేఈఈ కటాఫ్ అంచనా.. 85–90!.. ఏప్రిల్ సెషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..
జేఈఈ–మెయిన్ జనవరి సెషన్ పరీక్షలను జనవరి 24, 25, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో రోజుకు రెండు షిఫ్ట్‌ల్లో నిర్వహించారు. జనవరి 28న మాత్రం.. రెండో షిఫ్ట్‌ను బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్(బీఆర్క్), బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సులకు నిర్దేశించిన పేపర్ 2ఏ, పేపర్ 2బీ పరీక్షలు జరిగాయి. ‘జేఈఈ–మెయిన్ జనవరి సెషన్ పేపర్లు ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నాయి. పలు షిఫ్ట్‌లలో నిర్వహించిన పరీక్షల్లో కొన్ని షిఫ్ట్‌లు క్లిష్టంగా.. మరికొన్ని షిఫ్ట్‌లు ఓ మాదిరిగా ఉన్నాయి. స్కోర్లు, మార్కుల కేటాయింపులో ఎన్‌టీఏ నార్మలైజేషన్ విధానాన్ని అనుసరిస్తుంది. కాబట్టి క్లిష్టంగా ఉన్న స్లాట్లకు హాజరైన అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని అంటున్నారు నిపుణులు.
Also read: TSSPDCL Recruitment 2023 : టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 1601 పోస్టులు
తొలి షిఫ్ట్ సులభం
జనవరి 24న నిర్వహించిన తొలి షిఫ్ట్ సులభంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రశ్నలన్నీ సీబీఎస్‌ఈ 11, 12 తరగతుల సిలబస్ నుంచే అడిగారు. మ్యాథమెటిక్స్ క్లిష్టంగా, కెమిస్ట్రీ సాధారణ స్థాయిలో, ఫిజిక్స్ సబ్జెక్ట్ సులభంగా ఉంది. మొత్తంగా చూస్తే తొలి షిఫ్ట్ గతేడాది కంటే కొంత తేలికగా ఉందని విద్యార్థుల అభిప్రాయం.న్యూమరికల్ టైప్ ప్రశ్నలు మాత్రం సుదీర్ఘంగా, కాలిక్యులేషన్స్ ఎక్కువగా చేయాల్సిన విధంగా ఉన్నాయి. దీంతో విద్యార్థులకు కొంత సమయాభావ సమస్య ఎదురైంది. రెండో షిఫ్ట్‌లో కెమిస్ట్రీ క్లిష్టంగా, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ప్రశ్నలు ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నాయి.
రెండో రోజు
జనవరి 25న నిర్వహించిన తొలి షిఫ్ట్‌లో..మ్యాథమెటిక్స్ క్లిష్టంగా, కెమిస్ట్రీ ఓ మోస్తరు క్లిష్టతతో, ఫిజిక్స్ సులభంగా ఉన్నాయని అంటున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో అసెర్షన్స్ అండ్ రీజనింగ్ ఆధారిత ప్రశ్నలు అడిగారు. అదే విధంగా ఫార్ములా బేస్డ్ కొశ్చన్స్‌కు, న్యూమరికల్ బేస్డ్ కొశ్చన్స్‌కు ప్రాధాన్యం కనిపించింది. రెండో షిఫ్ట్‌లో..మ్యాథమెటిక్స్ సులభంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. కెమిస్ట్రీ ప్రశ్నలు సులభంగా ఉండడమే కాకుండా.. ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి కొన్ని ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ఫిజిక్స్ ఓ మోస్తరు క్లిష్టతతో ఉండగా.. న్యూమరికల్ టైప్ ప్రశ్నలు సులభంగా ఉన్నాయి.
Also read: Career Guidance: డిజైన్ కెరీర్స్‌కు.. దారిచూపే ఎఫ్‌డీడీఐ
మూడో రోజు.. సుదీర్ఘం
జనవరి 29న నిర్వహించిన తొలి షిఫ్ట్‌లో.. ప్రశ్నలు సుదీర్ఘ సమాధానాలు ఇచ్చే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్‌లో ప్రశ్నలు కాలిక్యులేషన్ ఆధారంగా సమాధానాలు ఇవ్వాల్సిన విధంగా అడిగారు. కెమిస్ట్రీ ప్రశ్నలు సులభంగా ఉండడమే కాకుండా.. ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఎక్కువ వెయిటేజీ కనిపించింది. దాదాపు 12 ప్రశ్నలు ఈ విభాగం నుంచే అడిగారు. ఫిజిక్స్ ప్రశ్నలు సులభంగా ఉండడం విద్యార్థులకు కలిసొచ్చిన అంశంగా పేర్కొనొచ్చు. రెండో షిఫ్ట్‌లో.. మ్యాథమెటిక్స్ క్లిష్టంగా, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ప్రశ్నలు సులభంగా ఉన్నాయి.
నాలుగో రోజు
జనవరి 30న నిర్వహించిన తొలి షిఫ్ట్‌లో..మ్యాథమెటిక్స్ ఓ మోస్తరు క్లిష్టతతో ఉంది. అల్జీబ్రా, కాలిక్యులస్, పారాబోలా, ఎలిప్స్, డెఫినిట్ ఇంటెగ్రల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, మాత్రికలు చాప్టర్లకు వెయిటేజీ లభించింది. ప్రశ్నలు మాత్రం సుదీర్ఘ సమాధానాలు ఇచ్చేలా.. కాలిక్యులేషన్ అవసరమయ్యేలా ఉన్నాయి. ఫిజిక్స్‌లో కైనమాటిక్స్, వర్క్ పవర్ అండ్ ఎనర్జీ, హీట్ అండ్ థర్మో డైనమిక్స్, రే ఆప్టిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్, ఏసీ సర్క్యూట్స్, మోడ్రన్ ఫిజిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, కెపాసిటర్స్ అంశాలకు వెయిటేజీ కనిపించింది. కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీకి వెయిటేజీ లభించింది. అదే విధంగా ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ నుంచి ఆరు ప్రశ్నల వరకు అడిగారు. రెండో షిఫ్ట్‌లో.. సీబీఎస్‌ఈ 11వ తరగతి చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. మ్యాథమెటిక్స్‌లో.. కాలిక్యులస్, కోఆర్డినేట్ జామెట్రీ, వెక్టార్స్ అండ్ 3డీ, అల్జీబ్రాలకు ప్రాధాన్యం కనిపించింది. ఫిజిక్స్‌లో సీబీఎస్‌ఈ 12వ తరగతి అంశాలకు ప్రాధాన్యం కనిపించింది. ప్రశ్నల క్లిష్టత స్థాయి ఓ మోస్తరుగా ఉంది. కెమిస్ట్రీలో సుదీర్ఘ సమాధానాలు ఇచ్చే ప్రశ్నలు ఎదురయ్యాయి.న్యూమరికల్ బేస్డ్ ప్రశ్నలలో అధిక శాతం ప్రశ్నలు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి అడిగారు.
Also read: JEE – Advanced – 2023: మారిన సిలబస్‌తో అడ్వాన్స్‌డ్!
అయిదో రోజు
జనవరి 31న నిర్వహించిన తొలి షిఫ్ట్‌లో.. మ్యాథమెటిక్స్ ప్రశ్నలు కొంత తికమకకు గురి చేసేలా ఉన్నాయి. కాలిక్యులేషన్ ఆధారంగా సమాధానాలు ఇచ్చేలా ఉన్నాయి. ఫిజిక్స్ ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. సెమీ కండక్టర్స్, మోడ్రన్ ఫిజిక్స్, ఈఎం వేవ్స్, మ్యాగ్నటిక్ ఫీల్డ్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఇండక్షన్‌కు ఎక్కువ వెయిటేజీ కనిపించింది. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీకి వెయిటేజి లభించిందని విద్యార్థులు పేర్కొంటున్నారు. రెండో షిఫ్ట్‌లో..అన్ని సబ్జెక్ట్‌లలోనూ సుదీర్ఘ సమాధానాలు ఇవ్వాల్సిన ప్రశ్నలు ఎదురయ్యాయి. మ్యాథమెటిక్స్ ప్రశ్నలు కాలిక్యులేషన్ అవసరమైనవిగా ఉండడంతో సమయాభావ సమస్య ఎదురైంది. కెమిస్ట్రీలో ప్రశ్నలు కూడా ఓ మోస్తరు క్లిష్టతతో అడిగారు. ఫిజిక్స్ మాత్రం సులభంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. మెకానిక్స్, వేవ్స్, మోడ్రన్ ఫిజిక్స్‌లకు కొంత ఎక్కువ ప్రాధాన్యం కనిపించింది. ప్రశ్నలన్నీ ఫార్ములా బేస్డ్‌గా ఉండడంతో విద్యార్థులు సులభంగా సమధానాలు ఇవ్వగలిగారని నిపుణులు అంటున్నారు.
చివరి రోజు.. సులభంగా
చివరి రోజు ఫిబ్రవరి 1న నిర్వహించిన మొదటి షిఫ్ట్ సులభంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. మ్యాథమెటిక్స్‌లో మాత్రం కొంత సుదీర్ఘ సమాధానాలు ఇచ్చే ప్రశ్నలు కనిపించాయి. కెమిస్ట్రీలో ఇనార్గానిక్ కెమిస్ట్రీకి వెయిటేజీ లభించింది. ఫిజిక్స్‌లో మోడ్రన్స్ ఫిజిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. రెండో షిఫ్ట్‌లో.. ప్రశ్నలు ఓ మోస్తరు క్లిష్టతతో అడిగారు. మ్యాథమెటిక్స్‌లో ఫార్ములా బేస్ట్ ప్రశ్నలకు ప్రాధాన్యం కనిపించింది. అదే విధంగా సీబీఎస్‌ఈ 12వ తరగతి చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ఫిజిక్స్‌లో ఫార్ములా బేస్డ్, కాన్సెప్ట్ ఆధారిత కొశ్చన్స్ అడిగారు.
Also read: EAMCET 2023: షెడ్యూల్ సమాచారం
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే
మొత్తంగా అన్ని షిఫ్ట్‌లను పరిగణనలోకి తీసుకుంటే..దాదాపు ప్రశ్నలన్నీ ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను ఆధారంగా చేసుకునే అడిగారు. దీంతో స్టేట్ బోర్డ్ విద్యార్థుల కంటే సీబీఎస్‌ఈ విద్యార్థులకు కొంత కలిసొచ్చే అవకాశం ఉందంటున్నారు.
సమయాభావం సమస్యగా
జేఈఈ–మెయిన్ జనవరి సెషన్‌లో.. అన్ని షిఫ్ట్‌ల విద్యార్థులు సమాయాభావ సమస్యను ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు. అన్ని షిప్ట్‌లలోనూ మ్యాథమెటిక్స్‌లో న్యూమరికల్ టైప్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు అభ్యర్థులకు కొంత ఎక్కువ సమయం పట్టింది. దీంతో ఇది మిగతా ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడంపై ప్రభావం చూపిందంటున్నారు. ప్రశ్నలన్నీ గత రెండేళ్లలో ఆయా విభాగాల్లో అడిగిన కాన్సెప్ట్‌ల మాదిరిగానే ఉన్నాయని అంటున్నారు. ప్రీవియస్ పేపర్లను సాధన చేసిన వారు తేలిగ్గా సమాధానాలు ఇచ్చే ఆస్కారం లభించిందని పేర్కొంటున్నారు. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీకి కొంత ఎక్కువ వెయిటేజీ కల్పించారనే భావన నెలకొంది.
Also read: JEE (Adv.) Previous Papers
ఫార్ములా, అప్లికేషన్ బేస్డ్
మొత్తంగా చూస్తే జేఈఈ–మెయిన్ తొలి సెషన్‌లోని అన్ని షిఫ్ట్‌లలోనూ ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించిన ప్రశ్నలన్నీ ఫార్ములా బేస్డ్‌గా, అప్లికేషన్ ఆధారితంగా ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు అంటున్నారు. ప్రిపరేషన్ సమయంలో కాన్సెప్ట్స్‌ను ఆధారంగా చేసుకుంటూ ప్రశ్నలు సాధన చేసిన వారు సమాధానాలు గుర్తించే విధంగా ఉన్నాయని చెబుతున్నారు.
కటాఫ్ పర్సంటైల్.. 85–90
జేఈఈ–మెయిన్ తొలి సెషన్‌లో కటాఫ్ జనరల్ కేటగిరీకి 85 నుంచి 90; ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌కి 60–65; ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 30–40గా ఉండొచ్చని పేర్కొంటున్నారు. గత ఏడాది కటాఫ్ జనరల్‌లో 88.4121, ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో 63.1114, ఓబీసీ కేటగిరీలో 67.0090, ఎస్‌సీ కేటగిరీలో 43.0820, ఎస్‌టీ కేటగిరీలో 26.7771లుగా ఉన్న సంగతి తెలిసిందే.
Also read: EAMCET 2023: షెడ్యూల్ సమాచారం
రెండో సెషన్‌కు హాజరు కావాలా?
జేఈఈ–మెయిన్ 2023 తొలి సెషన్ ముగిసిన నేపథ్యంలో.. ఏప్రిల్‌లో నిర్వహించే రెండో సెషన్‌కు హాజరు కావాలా? వద్దా? అనే సందేహం విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. తొలి సెషన్‌లో ఆశించిన మేర మార్కులు వస్తాయనుకునే అభ్యర్థులు అడ్వాన్స్‌డ్‌పై దృష్టి పెట్టాలని.. అదే ప్రిపరేషన్‌తో ఏప్రిల్ సెషన్ జేఈఈ–మెయిన్‌కు కూడా హాజరు కావచ్చొని సూచిస్తున్నారు. అంతేకాకుండా.. జేఈఈ మెయిన్‌లోని మూడు సబ్జెక్ట్‌ల్లోని.. ప్రతి సబ్జెక్ట్‌లో గరిష్టంగా 18 నుంచి 20 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి.. 85 పర్సంటైల్ వస్తుందనే ధీమా ఉన్న అభ్యర్థులు రెండో సెషన్ గురించి ఆలోచించకుండా.. అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమవ్వాలని సూచిస్తున్నారు.
రెండో సెషన్ కోసం
- తొలి సెషన్‌లో ప్రదర్శనను స్వీయ విశ్లేషణ చేసుకుంటూ.. రెండో సెషన్‌కు సన్నద్ధం కావాలి.
- తాము చేసిన పొరపాట్లు, ఏ టాపిక్స్‌కు సంబంధించిన అంశాల్లో సమాధానాలు రాయలేదో.. వాటిపై దృష్టి పెట్టాలి.
- ఆయా అంశాల్లో పట్టు సాధించేందుకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదవాలి. అదే విధంగా ప్రతిరోజు పునశ్చరణకు తప్పనిసరిగా నిర్దిష్ట సమయం కేటాయించుకోవాలి.
Also read: Animal Husbandary And Apiculture
బోర్డ్ పరీక్షలకు తొలి ప్రాధాన్యం
ఎన్‌టీఏ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం–జేఈఈ–మెయిన్ రెండో సెషన్.. ఏప్రిల్ ఆరు నుంచి 12వ తేదీ వరకు జరుగనుంది. అంటే.. విద్యార్థుల ప్రిపరేషన్‌కు ఇప్పటి నుంచి రెండు నెలల సమయం అందుబాటులో ఉంది. మరోవైపు మార్చిలో బోర్డ్ పరీక్షలు జరుగనున్నాయి. కాబట్టి ప్రస్తుతం విద్యార్థులు బోర్డ్ పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాత సమయాన్ని ఏప్రిల్‌లో జరిగే మెయిన్ పరీక్షకు కేటాయించాలి.
ఏప్రిల్ సెషన్.. ముఖ్యమైన టాపిక్స్
- మ్యాథమెటిక్స్: 3–డి జామెట్రీ; కో ఆర్డినేట్ జామెట్రీ; వెక్టార్ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్; కాంప్లెక్స్ నెంబర్స్; పారాబోలా; ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అదే విధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్; పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్, బైనామియల్ థీరమ్, లోకస్.
- ఫిజిక్స్: కైనమాటిక్స్, హార్మోనిక్ మోషన్స్, గ్రావిటేషన్, హీట్ అండ్ థర్మో డైనమిక్స్, వేవ్స్ అండ్ సౌండ్స్, మ్యాగ్నటిక్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఇండక్షన్, ఎలక్ట్రో స్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఆప్టిక్స్, మోడ్రన్ ఫిజిక్స్.
- కెమిస్ట్రీ: జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆల్కైల్స్, యాసిడ్స్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి. అదే విధంగా కెమికల్ బాండింగ్, పీరియాడిక్ టేబుల్, బ్రేకింగ్‌ల మూలాలుగా ఉంటాయి. దీనికి అనుగుణంగా అభ్యర్థులు మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి–బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి.
Also read: How To Score Good Percentile In JEE( Mains) 2023 Strategy - Tips
ఏప్రిల్ సెషన్ ముఖ్య తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఫిబ్రవరి 7 – మార్చి 7, 2023
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: మార్చి చివరి వారంలో
- రెండో సెషన్ పరీక్ష తేదీలు: 2023 ఏప్రిల్ 6 నుంచి 12 వరకు (ప్రతి రోజు రెండు షిఫ్ట్‌లలో)
- పూర్తి వివరాలకు, ఆన్‌లైన్ దరఖాస్తుకు వెబ్‌సైట్: https://jeemain.nta.nic.in/