Skip to main content

Career Guidance: డిజైన్‌ కెరీర్స్‌కు.. దారిచూపే ఎఫ్‌డీడీఐ

ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎఫ్‌డీడీఐ).. డిజైన్, ఫ్యాషన్‌ రంగంలో.. విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దే ఇన్‌స్టిట్యూట్‌. ఇందులో అడుగుపెడితే.. చక్కటి కెరీర్‌ అవకాశాలు దక్కడం ఖాయం. ఇందుకు చేయాల్సిందల్లా.. ఎఫ్‌డీడీఐ జాతీయ స్థాయిలో నిర్వహించే.. ఆల్‌ ఇండియా సెలక్షన్‌ టెస్ట్‌లో మంచి ర్యాంకు సొంతం చేసుకోవడమే!! 2023–24 విద్యాసంవత్సరానికి బ్యాచిలర్, పీజీ స్థాయి కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో..ఎఫ్‌డీడీఐ ప్రత్యేకతలు, క్యాంపస్‌లు, కోర్సులు, ప్రవేశ విధానంతోపాటు సెలక్షన్‌ టెస్ట్‌లో రాణించడమెలాగో తెలుసుకుందాం..
FDDI design careers
FDDI design careers

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎఫ్‌డీడీఐ).. డిజైన్, ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి బ్యాచిలర్, పీజీ స్థాయిలో పలు కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సులు వినూత్నమైన కెరీర్స్‌ కోరుకునే వారికి చక్కటి మార్గంగా నిలుస్తున్నాయి. ఇవి పూర్తి చేసుకుంటే రూ.లక్షల ప్యాకేజితో కెరీర్స్‌ సొంతం చేసుకోవచ్చు.

Also read: IT Crisis: ఇంత భారీస్థాయిలో ఉద్యోగుల తొలగింపా... వేలమంది ఒకేసారి ఇంటికి.. మైక్రోసాఫ్ట్‌ భారీ షాక్‌..!

12 క్యాంపస్‌లు.. 2,300 సీట్లు

  • ఎఫ్‌డీడీఐకి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 12 క్యాంపస్‌లు ఉన్నాయి. వాటిలో బ్యాచిలర్, పీజీ స్థాయిలో డిజైన్, ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు సంబంధించి మొత్తం 2,300 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్, బీబీఏ కోర్సుల్లో 1,880 సీట్లు, మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్, ఎంబీఏ (ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌)లో 420 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌లో ఒక క్యాంపస్‌ను నెలకొల్పారు. ఇందులో 340 సీట్లు ఉన్నాయి. 
  • హైదరాబాద్‌లోని క్యాంపస్‌లో బ్యాచిలర్‌ స్థాయిలో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ విభాగంలో.. ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌లో 80సీట్లు, లెదర్, లైఫ్‌స్టైల్‌ అండ్‌ ప్రొడక్ట్‌ డిజైన్‌లో 60 సీట్లు, ఫ్యాషన్‌ డిజైన్‌లో80 సీట్లు, బీబీఏ(రిటెయిల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌)లో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
  • పీజీ స్థాయిలో.. ఎంబీఏ (రిటెయిల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌) స్పెషలైజేషన్‌లో 60 సీట్లు ఉన్నాయి. 
  • అదేవిధంగా నోయిడాలో 400 సీట్లు, ఫరత్‌జంగ్‌లో 120, చెన్నైలో 180, కోల్‌కతలో 180, రోహ్‌తక్‌లో 120, జోథ్‌పూర్‌లో 120, చింద్వారాలో 180, గుణలో 60, అంక్లేశ్వర్‌లో 120, పాట్నాలో 240, చండీగఢ్‌లో 240 సీట్లు చొప్పున బ్యాచిలర్, పీజీ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థులకు మరో 230 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

అర్హత

  • బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులు: ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత ఉండాలి. 
  • వయసు: 2023 జూలై 1 నాటికి 25 ఏళ్ల లోపు ఉండాలి.
  • మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్, ఎంబీఏ (రిటెయిల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. పీజీ కోర్సులకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. 
  • ఆయా కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సెప్టెంబర్‌ 30, 2023 లోపు ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

Also read: UPSC Civil Services Notification 2023 : యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. 1105 పోస్టుల పూర్తి వివ‌రాలు ఇవే..

జాతీయ స్థాయి ఎంపిక పరీక్ష
మొత్తం 12 క్యాంపస్‌లలోని బ్యాచిలర్, పీజీ స్థాయిలో ప్రొడక్ట్‌ డిజైన్, ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఆల్‌ ఇండియా సెలక్షన్‌ టెస్ట్‌ పేరుతో ఎఫ్‌డీడీఐ.. జాతీయ స్థాయిలో ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహిస్తుంది. ఈ పరీక్షను బ్యాచిలర్, పీజీ కోర్సులకు వేర్వేరు విధానాల్లో నిర్వహిస్తుంది.

ఏఐఎస్‌టీ.. యూజీ పరీక్ష ఇలా

  • బ్యాచిలర్‌ స్థాయి కోర్సులకు నిర్వహించే పరీక్ష నాలుగు విభాగాల్లో మొత్తం 150 ప్రశ్నలు– 200 మార్కులకు ఉంటుంది. సెక్షన్‌ ఎ–క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 25 ప్రశ్నలు–25 మార్కులు;సెక్షన్‌ బి–వెర్బల్‌ ఎబిలిటీ(కాంప్రహెన్షన్,గ్రామర్, యూసేజ్‌) 40 ప్రశ్నలు–40మార్కులు; సెక్షన్‌ సి–జనరల్‌ అవేర్‌నెస్‌ 35 ప్రశ్నలు –35మార్కులు; సెక్షన్‌ డి–బిజినెస్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ 25ప్రశ్నలు–50మార్కులు, డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ 25 ప్రశ్నలు–50మార్కులకు పరీక్ష జరుగుతుంది. 
  • సెక్షన్‌ బిలో వెర్బల్‌ ఎబిలిటీకి సంబంధించి కాంప్రహెన్షన్‌ నుంచి 10 ప్రశ్నలు, గ్రామర్‌ అండ్‌ యూసేజ్‌ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు.

Also read: JEE – Advanced – 2023: మారిన సిలబస్‌తో అడ్వాన్స్‌డ్‌!

ఏఐఎస్‌టీ పీజీ పరీక్ష విధానం

  • ఎంబీఏ, ఎంబీఏ(ఆర్‌ఎఫ్‌ఎం) కోర్సులకు నిర్వహించే పరీక్ష కూడా నాలుగు విభాగాలుగా 175 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష ఉంటుంది. 
  • సెక్షన్‌ ఎ–క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 25 ప్రశ్నలు–50 మార్కులు; సెక్షన్‌ బి–ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ గ్రామర్‌ 50 ప్రశ్నలు–50మార్కులు; సెక్షన్‌–సి జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు; సెక్షన్‌–డి మేనేజ్‌మెంట్‌ అప్టిట్యూడ్‌ అండ్‌ అనలిటికల్‌ ఎబిలిటీ    50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 
  • ఉమ్మడి ప్రవేశ ప్రక్రియ
  • ఎఫ్‌డీడీఐకు సంబంధించిన 12 క్యాంపస్‌ల్లో ఏఐఎస్‌టీలో అభ్యర్థులు పొందిన ర్యాంకు ఆధారంగా.. ఉమ్మడి ప్రవేశ ప్రక్రియ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తారు. బ్యాచిలర్, పీజీ స్థాయి ప్రోగ్రామ్‌లకు వేర్వేరుగా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అభ్యర్థుల ర్యాంకు, రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకొని సీటు ఖరారు చేస్తారు.

ఉజ్వల కెరీర్‌
ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌లలో సీటు సొంతం చేసుకున్న వారికి ఉజ్వల కెరీర్‌ అవకాశాలు లభిస్తున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్, టాటా గ్రూప్, బాటా, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ప్రముఖ సంస్థల్లో కొలువులు లభిస్తాయి. స్వయం ఉపాధి పరంగా స్టార్టప్‌ సంస్థలను సైతం ఏర్పాటు చేసుకునే అవకాశముంది. ఎఫ్‌డీడీఐ అన్ని క్యాంపస్‌ల విద్యార్థులకు కలిపి ఉమ్మడిగా ప్లేస్‌మెంట్స్‌ నిర్వహించడం మరో ప్రత్యేకత. 

Also read: TSPSC Group-4 : పది లక్షల మంది పోటీ... ఈ మెలకువలు పాటిస్తే విజయం సాధ్యం!


భారీగా వేతనాలు
ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌లలో బ్యాచిలర్, పీజీ ఉత్తీర్ణులకు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌ ద్వారా రూ.లక్షల వేతనంతో కొలువులు ఖరారవుతున్నాయి. గత మూడేళ్ల క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ గణాంకాలను చూస్తే.. ఎనభై శాతం మందికిపైగా విద్యార్థులకు ఆఫర్లు లభించాయి. వీరికి సగటు వేతనం రూ.8లక్షలుగా నమోదైంది. అడిడాస్‌ ఇండియా, ప్యూమా, ఆలైన్‌ అపారెల్స్, ఆదిత్య బిర్లా తదితర ప్రముఖ సంస్థలు టాప్‌ రిక్రూటర్స్‌గా నిలిచాయి.

జాబ్‌ ప్రొఫైల్స్‌
ఎఫ్‌డీడీఐ కోర్సుల ఉత్తీర్ణులకు ఫుట్‌వేర్‌ డిజైనర్, ప్రొడక్ట్‌ డెవలపర్, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్, క్వాలిటీ కంట్రోలర్, ఫుట్‌వేర్‌ టెక్నాలజిస్ట్, మెర్చెండైజర్, మార్కెటింగ్, ప్లానింగ్‌ ఎగ్జిక్యూటివ్, ట్రెండ్‌ అనలిస్ట్, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, డిజైన్‌ మ్యానుఫాక్చరింగ్‌ ఆపరేషన్స్, స్టోర్‌ మేనేజర్, ఫ్లోర్‌ మేనేజర్, ఏరియా మేనేజర్‌ వంటి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. బీబీఏ, ఎంబీఏ కోర్సులు పూర్తి చేసిన వారు ప్రముఖ ఈ–కామర్స్, టెక్స్‌టైల్‌ రంగాల్లోని సంస్థల్లో నిర్వహణ విభాగాల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు. 

Also read: TSPSC Group-1 2023: మెయిన్‌లో మార్పులు.. మెరిసే మార్గాలు ఇవే!!

ఏఐఎస్‌టీ.. రాణించేలా
ఆల్‌ ఇండియా సెలక్షన్‌ టెస్ట్‌లో విజయానికి దృష్టి పెట్టాల్సిన అంశాలు..
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌
అభ్యర్థుల్లోని మ్యాథమెటికల్, అర్థమెటికల్‌ నైపుణ్యాన్ని పరీక్షించే విభాగం ఇది. ఇందులో విజయానికి అర్థమెటిక్‌–రేషియో, మిక్చర్స్, వర్క్, యావరేజ్, పర్సంటేజ్, టైమ్‌ అండ్‌ స్పీడ్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, ఇంటరెస్ట్, బేసిక్‌ స్టాటిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా నెంబర్‌ ప్రాపర్టీస్, ప్రాబబిలిటీ, కౌంటింగ్‌ ప్రిన్సిపల్స్, జామెట్రీ, డెరివేటివ్స్‌(మ్యాగ్జిమా–మినిమా) వంటి ప్యూర్‌ మ్యాథ్స్‌ అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి.

వెర్బల్‌ ఎబిలిటీ
ఇంగ్లిష్‌ నైపుణ్యాన్ని పరిశీలించే ఈ విభాగంలో రాణించడానికి ఇంగ్లిష్‌ గ్రామర్‌తోపాటు, లాజికల్‌ రీజనింగ్‌ అంశాలు, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, సీక్వెన్సెస్, బ్లడ్‌ రిలేషన్స్, కోడింగ్, డీ–కోడింగ్‌ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.

Also read: TSPSC Polytechnic Lecturer notification: మీరూ అవుతారా.. పాలిటెక్నిక్‌ లెక్చరర్‌!


జనరల్‌ అవేర్‌నెస్‌
ఈ విభాగానికి సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, అదే విధంగా హైస్కూల్‌ స్థాయి సోషల్‌ సబ్జెక్ట్‌ను చదవాలి. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించి ముఖ్య ఘటనలపై అవగాహన పెంచుకోవాలి. 

డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌
డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌కు సంబంధించి ఏదైనా ఒక ఆకృతిని రూపొందించే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి. ఇక.. బిజినెస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌కు సంబంధించి డిజైన్‌ రంగంలో తాజా పరిణామాలు, మార్కెట్‌ పరిస్థితులు, టాప్‌ కంపెనీలు తదితర అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

ముఖ్య సమాచారం

  •      ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్‌ 23, 2023
  •      ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ: మే 1, 2 తేదీల్లో
  •      అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: జూన్‌ 5 నుంచి
  •      ఏఐఎస్‌టీ పరీక్ష తేదీ: జూన్‌ 18, 2023
  •      తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం
  •      వెబ్‌సైట్‌: www.fddiindia.com/admissionprocess.php

Also read: TSPSC Jobs Notification 2022: 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు

Published date : 02 Feb 2023 11:43AM

Photo Stories