Skip to main content

UPSC Civil Services Notification 2023 : యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. 1105 పోస్టుల పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్ 2023 నోటిఫికేషన్‌ను ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన (బుధ‌వారం) విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
UPSC Civil Services Notification 2023 Details
UPSC Civil Services Notification 2023 News

డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా అర్హులే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సివిల్ సర్వీసులకు చెందిన 1105 ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థు నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

అర్హతలు ఇవే..: 
అభ్యర్ధులు ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా అర్హులే.

➤☛ IAS Success Story : కూలీనాలీ చేస్తూ చ‌దివాడు.. ఐఏఎస్ సాధించాడు.. కానీ ఈయ‌న పెళ్లి మాత్రం..
వయోపరిమితి ఇలా..: 
అభ్యర్థుల వయసు 01-08-2023 నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే 32 ఏళ్లు మించకుండా ఉండాలి. అంటే 02-08-1991 నుంచి 01-08-2002 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీకి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

భ‌ర్తీ చేయ‌నున్న‌ సివిల్ సర్వీసెస్ పోస్టులు ఇవే..:

upsc jobs

☛ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్

☛ ఇండియన్ ఫారిన్ సర్వీస్

☛ ఇండియన్ పోలీస్ సర్వీస్

➤☛ Inspirational Success Story : నిజంగా.. ఈ క‌లెక్ట‌ర్ స్టోరీ మ‌న‌కు క‌న్నీరు పెట్టిస్తోంది..

గ్రూప్-ఎ ఇవే..:

☛ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ 

☛ ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్

☛ ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్

☛ ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్

☛ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్

☛ ఇండియన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీస్

☛ ఇండియన్ పోస్టల్ సర్వీస్

☛ ఇండియన్ పీ&టీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ 

☛ ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్

☛ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ & ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్)

☛ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఇన్‌కం ట్యాక్స్) 

➨ ఇండియన్ ట్రేడ్ సర్వీస్ (గ్రేడ్-3)

☛ ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ 

☛ IPS Success Story : ఇంట్లో చెప్ప‌కుండా.. ఐపీఎస్ కొట్టానిలా.. కానీ..

గ్రూప్-బి :

☛ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ సివిల్ సర్వీస్, గ్రూప్-బి(సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్)

☛ ఢిల్లీ, అండమాన్ & నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా &  నగర్ హవేలీ సివిల్ సర్వీస్, 

☛ ఢిల్లీ, అండమాన్ & నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ డయ్యూ, దాద్రా & నగర్ హవేలీ పోలీస్ సర్వీస్

☛ పాండిచ్చేరి సివిల్ సర్వీస్

☛ పాండిచ్చేరి పోలీస్ సర్వీస్

IAS Success Story : కూలీనాలీ చేస్తూ చ‌దివాడు.. ఐఏఎస్ సాధించాడు.. కానీ ఈయ‌న పెళ్లి మాత్రం..

అటెంప్టుల సంఖ్య : 
జనరల్‌కు ఆరు, ఓబీసీలు, దివ్యాంగుల(జీఎల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ)కు తొమ్మిది సార్లు అవకాశం ఉంది. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు అపరిమితం.

ఎంపిక విధానం:

రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం ఇలా..: 

upsc civils exam tips telugu

ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 2 గంటల్లో 200 మార్కులకు ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలుంటాయి. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. రెండో పేపర్ జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్‌గా ఉంటుంది. దీనిలో 33 శాతం అర్హత సాధించాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు.

☛ UPSC Civils Ranker Success Story : విధికే సవాలు విసిరా.. 22 ఏళ్లకే సివిల్స్ కొట్టానిలా..

మెయిన్స్ పరీక్ష విధానం :
మొత్తం 1750 మార్కులకు యూపీఎస్సీ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక 275 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ) ఉంటుంది. ఇవి రెండు కలిపి 2025 మార్కులకు తుది ఎంపిక ఉంటుంది. పరీక్షలో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 250 మార్కులు కేటాయించారు. అయితే వీటిలో ఒక్కో పేపరుకు 300 మార్కుల చొప్పున క్వాలిఫయింగ్ పేపర్లు(పేపర్-ఎ, పేపర్-బి) ఉంటాయి. వీటి మార్కులను పరిగణనలోకి తీసుకోరు.  
దరఖాస్తు విధానం: 
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

☛ IAS Officer Success Story : భ‌ర్త స‌పోర్ట్‌తో.. కోచింగ్ లేకుండానే ఐఏఎస్ కొట్టానిలా..

దరఖాస్తు ఫీజు : ఓబీసీ/ ఇతర అభ్యర్థులకు రూ.100(ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).

ముఖ్యమైన తేదీలు ఇవే :
దరఖాస్తులు ప్రారంభం: 2023, ఫిబ్రవరి 1
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 21, 2023
దరఖాస్తు సవరణ తేదీలు: ఫిబ్రవరి 22, 2023 నుంచి ఫిబ్రవరి 28, 2023 వరకు ఉంటుంది.
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: మే 28, 2023

☛ Civil Ranker Story: ఫెయిల్యూర్ వ‌చ్చిన‌ప్పుడు చాలా తేలిగ్గా తీసుకున్నా.. నాలుగు సార్లు ఫెయిల్ అయ్యా.. కానీ..

యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేష‌న్ 2023 పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 01 Feb 2023 11:39PM
PDF

Photo Stories