Skip to main content

IAS Officer Success Story : భ‌ర్త స‌పోర్ట్‌తో.. కోచింగ్ లేకుండానే ఐఏఎస్ కొట్టానిలా..

దివ్య మిట్టల్... సివిల్ సర్వీస్ అధికారిగా ఆమె ప్రయాణం నేటి తరానికి చాలా స్ఫూర్తినిస్తోంది. ఈమె ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. వాస్తవానికి దివ్య భర్త ఐఏఎస్ అధికారి.
divya mittal ias success story
Divya Mittal IAS

తన భర్త ఐఏఎస్ అధికారిగా చేస్తున్న సేవలు ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో దివ్య లండన్‌లో తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి.. ఐఏఎస్ ఉద్యోగం కాట్టాల‌ని నిర్ణయించుకున్నారు.

Inspirational Success Story: సివిల్స్‌లో 37వ ర్యాంక్ కొట్టా.. గ్రూప్‌-1లో 3వ ర్యాంక్ కొట్టా.. ఈ క్రెడిట్ అంతా ఈయ‌న‌కే..

కుటుంబ నేప‌థ్యం :
మా అమ్మ నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. మా అమ్మ ముగ్గురు పిల్లల్ని పెంచింది. ముగ్గురం ఐఐటికి వెళ్లాం. నేను ఐఐఎంలో కూడా చదివాను. ఆ తర్వాత 2013 కేడర్‌లో ఐఏఎస్‌ అయ్యాను. నా ఇద్దరు తోబుట్టువులు కూడా బాగా సెటిల్‌ అయ్యారు. ఇదంతా మంచి పెంపకం వల్లే జరిగిందని అనుకుంటున్నాను.

ఎడ్యుకేష‌న్ :

divya mittal ias education

దివ్య మొదటి నుంచి చదువులో దిట్ట. ఐఐటీ ఢిల్లీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుని.. ఆపై ఐఐఎం బెంగళూరు నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఈ రెండు విద్యా సంస్థలు ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థలుగా పరిగణించబడుతున్న విష‌యం తెల్సిందే.

Success Story: ఎలాంటి కోచించి లేకుండానే.. సివిల్స్‌లో 74వ‌ ర్యాంక్ కొట్టానిలా..

అత్యంత కఠినమైన పరీక్షల్లో..

divya mittal ias

ఎప్పుడూ తాను ఇండియాను మిస్సవున్నానని ఫీల్ అయ్యేదాన్ని.., దీంతో స్వదేశానికి వచ్చి తనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న. అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన యూపీఎస్సీని  ఛేదించడానికి దివ్య కోచింగ్ తీసుకోలేదు. గగన్‌దీప్ సింగ్ 2011లో యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించగా, రెండేళ్ల తర్వాత 2013లో దివ్య యూపీఎస్సీ ప‌రీక్ష‌ల్లో విజయం సాధించారు. ఇప్పుడు భార్యాభ‌ర్త‌ ఇద్దరూ యూపీ కేడర్‌లో విధులను ఉన్నారు.

Civil Ranker Story: ఫెయిల్యూర్ వ‌చ్చిన‌ప్పుడు చాలా తేలిగ్గా తీసుకున్నా.. నాలుగు సార్లు ఫెయిల్ అయ్యా.. కానీ..

ప్రస్తుతం దివ్య యూపీలోని మీర్జాపూర్ జిల్లాకు జిల్లా మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీర్జాపూర్ డీఎం కంటే ముందు ఆమె సంత్ కబీర్ నగర్ డీఎంగా కూడా పనిచేశారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఆమె చాలా ప్రతిభావంతులైన ఐఎఎస్ అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. ముస్సోరీలో శిక్షణ తీసుకునే సమయంలో ఆమె అద్భుతమైన ప్రదర్శనకు అశోక్ బంబావాలే అవార్డు కూడా లభించింది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఆమె చాలా ప్రతిభావంతులైన ఐఎఎస్ అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు.

ఈ భ‌ర్త‌..

divya mittal ias husband

గగన్‌దీప్ ఐఏఎస్ ఆఫీసర్ కంటే ముందు ఇంజనీర్‌గా పనిచేశారు.  బాగా స్థిరపడిన కెరీర్‌ని వదిలి సివిల్ సర్వీస్‌లో చేరడం దివ్యకు అంత ఈజీ కాలేదు. అయితే ఐఏఎస్ కావాలనే తన కలను మాత్రం వదులుకోనని మనసులో నిశ్చయించుకున్నారు.

UPSC Civils Topper Shruti Sharma : సివిల్స్ టాప‌ర్ శృతి శర్మ.. స‌క్సెస్ సిక్రెట్‌ ఇదే..

Published date : 25 Jan 2023 01:20PM

Photo Stories