Prof. DP Agrawal, Ex Chairman of UPSC : యూపీఎస్సీ సివిల్స్‌లో ఈ మూడు దశలను దాటాలంటే.. ఏం చేయాలి..? ఏం చేయకూడదు..?
శిక్షణలో చెప్పే అంశాలను మనసుకు ఎక్కించుకుని.., ఆస్వాదిస్తూ నేర్చుకోవాలి తప్ప మూసపద్ధతిలో కష్టపడటం వల్ల అంత మంచి ఫలితాలు రావని ప్రొఫెసర్ అగర్వాల్ అన్నారు.
పోటీ పరీక్షలలో అయితే..
యూనివర్సిటీ పరీక్షలకు, పోటీ పరీక్షలకు కొంత తేడా ఉంటుందని ఆయన చెప్పారు. సాధారణంగా యూనివర్సిటీ పరీక్షలలో అయితే.., కేవలం ఆ సబ్జెక్టులో పరిజ్ఞానాన్ని మాత్రమే చూస్తారని, అదే పోటీ పరీక్షలలో అయితే మన వ్యక్తిత్వం మొత్తాన్ని అంచనా వేస్తారని అన్నారు. ఆ విధంగా పోటీ పరీక్షలకు సిద్ధపడేవారు అది ఏ పరీక్ష అయినా, తమ వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవాలని సూచించారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన విద్యార్థులతో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 200 మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మూడు దశలను దాటాలంటే..
ఇలాంటి విద్యార్థులను చూసినప్పుడల్లా తనకు మళ్లీ తన యవ్వనదశ, విద్యార్థిగా ఉన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయని, ఇప్పటి పిల్లలకు అప్పటికంటే అనేక అవకాశాలు ఉన్నందున వాటిని సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో మరింత ఉన్నతస్థానాలకు ఎదగాలని ప్రొఫెసర్ అగర్వాల్ ఆకాంక్షించారు. యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అఖిలభారత సర్వీసులకు వెళ్లాలని ఆకాంక్ష ఉన్న విద్యార్థులు.. యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశలను దాటాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలను కూలంకషంగా చెప్పడం చాలా ముఖ్యమని తెలిపారు. కృష్ణప్రదీప్ ట్వంటీఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీకి యూపీఎస్సీ మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ డీపీ అగర్వాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి, విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.
Tags
- Careers UPSC
- upsc civils 2024 success strategy
- upsc former chairman dp agarwal
- Prof DP Agrawal Ex Chairman of UPSC
- IAS
- IPS officers
- UPSC
- UPSC jobs
- UPSC Exams
- UPSC Preparation Plan
- Civil Services Success Stories
- Competitive Exams Success Stories
- Pressure-free studying
- sakshieducation preparationtips
- Prof. DP Agarwal
- Integrity in studying