Skip to main content

EAMCET 2023: షెడ్యూల్‌ సమాచారం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌కు సంబంధించిన షెడూల్‌ వచ్చే వారం వెలువడే వీలుంది.
EAMCET 2023 schedule information
ఎంసెట్ 2023 షెడ్యూల్‌ సమాచారం

మే మొదటి వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఎంసెట్‌ షెడ్యూల్‌ ఖరారుపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి కసరత్తు ఇప్పటికే మొదలైంది. జేఈఈ మెయిన్స్‌ జనవరి 24 నుంచి మొదలవుతుంది. రెండో విడత జేఈఈ ఏప్రిల్‌ 2 నుంచి నిర్వహిస్తారు. ఇంటర్‌ పరీక్షలు మార్చిలో ముగుస్తాయి. ఇంటర్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత 45 రోజుల పాటు ఎంసెట్‌ సన్నద్ధతకు సమయం ఇవ్వడం ఆనవాయితీ. దీన్ని దృష్టిలో ఉంచుకుని మే మొదటి వారంలో ఎంసెట్‌ నిర్వహించవచ్చని చెబుతున్నారు.

చదవండి: ఎంసెట్‌ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్

ఫలితాలను జూన్‌ మొదటి వారంలో ప్రకటించి, సెపె్టంబర్‌ కల్లా సీట్ల భర్తీ చేపట్టాలని భావిస్తున్నారు. జేఈఈ మెయి న్స్‌ జనవరిలోనే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది ఈ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉండదు. ఇంటర్‌ సిలబస్‌ ఫిబ్రవరి నెల రెండో వారం వరకూ కొనసాగే వీలుంది. దీంతో ఎక్కువ మంది రాష్ట్ర ఎంసెట్‌పై ఆధారపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 2022లో కూడా ఎంసెట్‌ రాసిన వారి సంఖ్య అంతకు ముందు 2021తో పోలిస్తే ఐదు వేలు పెరిగింది. ఈసారి మరింత పెరుగుతుందనే అంచనాల్లో అధికారులున్నారు.

Also Read: EAMCET QUICK REVIEW | BIT BANK | GUIDANCE | MODEL PAPERS | PREVIOUS PAPERS | PRACTICE QUESTIONS

Published date : 06 Jan 2023 02:47PM

Photo Stories