TSPSC Group 2 Jobs : గ్రూప్–2 పోస్టులకు 5,51,943 దరఖాస్తులు.. ఒక్కో పోస్టుకు ఎంతమంది పోటీ అంటే..? ఈ సారి ఎక్కువ పోస్టులు వీరికే..
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గతేడాది డిసెంబర్ 29న నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో కమిషన్ వెబ్‌సైట్లో 5.50 లక్షల మంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. గ్రూప్– 2కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను అతి త్వరలో ప్రకటించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఫిబ్రవరి 16వ తేదీన (గురువారం) ఒక ప్రకటనలో తెలిపారు.
ఒక్కో పోస్టుకు..
TSPSC గ్రూప్-2 నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 783 పోస్టులకు.. వచ్చిన దరఖాస్తులను పోల్చితే... ఒక్కో పోస్టుకు 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు. పరీక్షా తేదీని వచ్చే వారంలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డేట్స్ ప్రకటించే అవకాశం ఉంది.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
ఈ గ్రూప్ -2 నోటిఫికేషన్‌లో మహిళలకే.. ఎలా అంటే..?
ఈ గ్రూప్ -2 నోటిఫికేషన్‌లో మహిళలకు అగ్రస్థానం దక్కిందనే చెప్పొచ్చు. మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులు భర్తీ చేయనుండగా... వీటిలో 350 పోస్టులు మహిళలకే రిజర్వు అయ్యాయి. జనరల్ కేటగిరీలో 55.31 శాతం చొప్పున 433 పోస్టులున్నాయి. రెండు విభాగాల్లోని పోస్టుల్లో చూస్తే ఒక్కటీ కూడా జనరల్ కేటగిరీలో లేదు. కార్మికశాఖ పరిధిలోని సహాయ కార్మికశాఖ అధికారి పోస్టులు తొమ్మిది ఉంటే.. ఇవన్నీ కూడా మహిళలకే కేటాయించారు. ఎన్నికల కమిషన్‌లో రెండు సహాయ సెక్షన్ అధికారి పోస్టులుంటే అవి రోస్టర్ ప్రకారం మహిళల కోటాలోకి వచ్చాయి. సహాయ వాణిజ్య పన్నుల అధికారి పోస్టులు 59 ఉంటే మహిళలకు దాదాపు సగం వారికే రిజర్వయ్యాయి. రెవెన్యూశాఖలో నాయబ్ తహసీల్దారు పోస్టులు 98 ఉంటే ఇందులో 53 మహిళలవే. ఇదే తరహాలో కొన్ని విభాగాల్లో సగానికిపైగా పోస్టులు మహిళలకే రిజర్వ్ అయ్యాయి. మొత్తంగా ఈ నోటిఫికేన్‌లో మహిళలకు 44 శాతానికి పైగా పోస్టులు దక్కినట్లు అయింది. తద్వారా 350 పోస్టులు వారికే దక్కనున్నాయి.
➤ TSPSC Group 2 Success Tips : గ్రూప్-2లో ఫోకస్ చేయాల్సిన అంశాలు ఇవే..| TSPSC Group 2 Syllabus
సిలబస్‌లో మార్పులు ఇవే..!
మొత్తం నాలుగు పేపర్లలో పేపర్-2లో స్వల్ప మార్పులు ఉన్నాయి. ఇక పేపర్-3లో చాలా మార్పులే చేశారు. పేపర్-1, 4 లో ఎలాంటి మార్పులు లేవు. పేపర్-2లోని పార్టు-2లో గతంలో ఉన్న ‘భారత రాజ్యాంగం - కొత్త సవాళ్లు’.. ‘భారత రాజ్యాంగం -సవరణల విధానం, సవరణ చట్టాలు’గా మారింది. ‘దేశంలో న్యాయవ్యవస్థ’ సబ్జెక్టులో జ్యుడీషియల్ రివ్యూ, సుప్రీంకోర్టు, హైకోర్టు అంశాలు అదనంగా వచ్చాయి. ప్రత్యేక రాజ్యాంగ నియమావళిలో మహిళలు, మైనార్టీలు, ఈడబ్ల్యూఎస్ వర్గాలు.. జాతీయ కమిషన్లలో మహిళా, మైనార్టీ, మానవ హక్కులను చేర్చారు. జాతీయ సమైక్యత, సవాళ్లు, అంతర్గత భద్రత, అంతర్రాష్ట్ర సవాళ్లు సబ్జెక్టుగా వచ్చాయి. పేపర్-3లోనూ ఒక్కోపార్టులో పలు అంశాలను సిలబస్‌లోకి చేర్చారు.
➤ Competitive Exams Success Plan : ఈ మూడు వ్యూహాలు పాటిస్తే.. ప్రభుత్వ ఉద్యోగం మీదే..
పరీక్షా విధానం ఇలా..
గ్రూప్ 2 పరీక్షను మొత్తం 600 మార్కులకు నిర్వహించనున్నారు. ఇందులో 4 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌లో 150 మల్టిపుల్ ఛాయిల్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి పేపర్ పరీక్ష కాల పరిమితి రెండున్నర గంటలు ఉంటుంది. పేపర్-1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, పేపర్-2లో చరిత్ర, పాలిటీ, సొసైటీ, పేపర్-3లో ఎకానమీ, డెవలప్‌మెంట్, పేపర్-4లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటుపై ప్రశ్నలుంటాయి. గతంలో మాదిరిగా ఇంటర్వూలు లేవు.
☛ TSPSC Group 1 Success Tips: రెండు నెలల ప్రిపరేషన్‌తోనే.. గ్రూప్–1 ఉద్యోగం కొట్టానిలా..