Skip to main content

TSPSC Group 1 Success Tips: రెండు నెలల ప్రిపరేషన్‌తోనే.. గ్రూప్‌–1 ఉద్యోగం కొట్టానిలా..

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1కు ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం.. ప్రస్తుత జీహెచ్‌ఎంసీలో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న వి.ప్రశాంతి సూచనలు .. సలహాలు మీ కోసం..
వి.ప్రశాంతి, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌
వి.ప్రశాంతి, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌

ఏ అంశాల్లో బలంగా, బలహీనంగా ఉన్నారో..
గ్రూప్‌–1కు ప్రిపేరయ్యే అభ్యర్థులు అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పరీక్షకు ఎన్ని రోజులు సమయం ఉంది? సిలబస్‌లో పేర్కొన్న ఏ అంశాల్లో బలంగా, బలహీనంగా ఉన్నారో అంచనా వేసుకోవాలి. సంబంధించిన మెటీరియల్‌ను సమకూర్చుకోవాలి. ఒక సబ్జెక్టును ఎన్ని రోజులు చదవాలో ప్రణాళిక రూపొందించుకోవాలి. అది నిత్యం కళ్లముందు కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకనుగుణంగా స్థిరంగా ప్రిపరేషన్‌ కొనసాగించాలి. నిర్ణీత సమయంలో వాటిని పూర్తిచేయాలి. క్లిష్టమైన అంశాలు ఎక్కువ సమయం తీసుకున్నా, సులువైన అంశాలు చదివేటప్పుడు సమాయాన్ని ఆదా చేసుకోవాలి. చదివిన అంశాలపై ఎప్పటికప్పుడు బిట్స్‌ను సాధనచేయాలి. ఫలితాలను విశ్లేషించుకుని ప్రిపరేషన్‌ సరైన మార్గంలో సాగుతుందో తెలుసుకోవాలి. 

Success Story: ఫ‌స్ట్ ర్యాంక్ సాధించా .. ఆర్‌టీఓగా ఉద్యోగం కొట్టా..

ఇందుకు నేనే ఒక ఉదాహరణ..
టీఎస్‌పీఎస్సీ ఏర్పాటైన తర్వాత నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలించి ప్రశ్నల సరళిని తెలుసుకోవాలి. ఏ సబ్జెక్టుకు ఎక్కువ వెయిటేజీ ఇస్తున్నారో గమనించాలి. రెండు నెలల్లో సిలబస్‌ అంశాలను పూర్తిగా చదివి జూలై నెలలో రివిజన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. పూర్తి నిబద్ధతతో, కష్టపడి చదివితే కొత్తగా ప్రిపరేషన్‌ ప్రారంభించేవారూ విజేతలుగా నిలవచ్చు. అందుకు నేనే ఒక ఉదాహరణ. మే నెలలో పరీక్షలుండగా నేను మార్చిలో బేసిక్స్‌ నుంచి ప్రిపరేషన్‌ ప్రారంభించాను. శిక్షణలో చెప్పిన అంశాలను ఇంటి వద్ద క్రమం తప్పకుండా సాధన చేశాను. కాబట్టి అభ్యర్థులు 503 పోస్టుల్లో ఒక పోస్టు తమదే అనుకుని ఆత్మవిశ్వాసంతో చదవాలి. ఇప్పటికే ప్రిపరేషన్‌ కొనసాగిస్తున్నవారు, సివిల్స్‌ ఆశావహులు తెలంగాణ చరిత్ర,సంస్కృతి, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఎకానమీ అంశాలపై దృష్టి సారించాలి.

Group 1 Ranker: ఆన్‌లైన్‌ కోచింగ్‌..గ్రూప్‌–1 ఉద్యోగం

ఆలస్యంగా ఈ ఉద్యోగంలో చేరానని..
చాలా ఆలస్యంగా ఈ ఉద్యోగంలో చేరానని బాధపడుతూ ఉంటాను. ప్రతిక్షణం ప్రజలకు ఇంకా ఏం చేయగలనో ఆలోచిస్తుంటాను. అంతేకాదు, ఎన్ని సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నా ప్రభుత్వ ఫలాలను ప్రజలకు చేర్చడంలో నేను రాజీ పడను. ఇది ప్రజలతో మమేకమై, వారికి సేవచేయడానికి నాకిచ్చిన సువర్ణావకాశంగా భావిస్తున్నాను.

Group-2 Job:మొదటి ప్రయత్నంలోనే విజయం..గ్రూపు–2లో ఉద్యోగం..ఎలా అంటే..

వి.ప్రశాంతి గురించి..
గ్రూప్-1లో టాప్ 3 ర్యాంక్..
తనకున్న పరిధిలోనే ఇంత చేయగలిగితే, ఒకవేళ ప్రభుత్వ సర్వీసులో ఉంటే ఇంకా ఎక్కువే చేయచ్చు కదా అనుకున్నారు. ఉన్నతమైన ఆశయాలున్న ప్రశాంతిని ఆమె ఆలోచనలు గ్రూప్-1 ఉద్యోగం వైపునకు నడిపించాయి. భర్త, ఇతర కుటుంబ సభ్యులు అందుకు సహకరించారు. దీంతో తను రాసిన పరీక్షలో ఓవరాల్ గా 9వ ర్యాంకు, మహిళల విభాగంలో 3వ ర్యాంకు సాధించారు. 2016-17 గ్రూప్-1 నోటిఫికేషన్‌లో మున్సిపల్ శాఖలో డిప్యూటీ కమిషనర్ ఉద్యోగాన్ని సాధించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో తొలి పోస్టింగ్ వచ్చింది. ప్ర‌స్తుతం జీహెచ్‌ఎంసీలో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

DSP Snehitha : గ్రూప్‌–1కు సెలక్టయ్యానిలా...ముగ్గురం ఆడపిల్లలమే..అయినా

ప్రొఫెసర్‌గా.. 
అనంతరం అరోరా బిజినెస్ స్కూల్ ఆంధ్రా మహిళా సభలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. ఇలా తన ఇంటిని, తన వాళ్లను చూసుకుంటూ, ఇటు ఉద్యోగం చేసుకుంటూ.. తనకున్న సమయంలో సమాజంలోని పేదవారికి ఏదైనా చేయాలని ఆలోచించేవారు.

Y.Obulesh, Group 1 Ranker : ప్ర‌భుత్వ స్కూల్‌లో చ‌దివా...ప్ర‌భుత్వ ఉద్యోగం కొట్టానిలా..

చదువు..
ప్రశాంతి స్వస్థలం మహబూబ్ నగర్. ఎంబీబీఎస్ చేయాలనే లక్ష్యంతో ఎంసెట్‌లో ఓయూ పరిధిలో 2100 ర్యాంకు సాధించారు. కానీ, వైద్యకళాశాలలో సీటు రాకపోవడంతో ఎల్‌ఎల్‌బీ చేసి, ఆ విద్యాసంవత్సరపు టాపర్‌గా నిలిచారు.

Success Story: వేలల్లో వచ్చే జీతం కాద‌నీ.. నాన్న కోరిక కోసం గ్రూప్-2 సాధించానిలా..

Published date : 04 May 2022 07:09PM

Photo Stories