Skip to main content

APPSC Group1 & 2 Posts Notification 2023 : గుడ్‌న్యూస్‌.. గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌.. మొత్తం ఎన్ని పోస్టులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎంతో మంది అభ్య‌ర్థులు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచుస్తున్నఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీకి ముఖ్య‌మంత్రి వైయస్‌.జగన్‌మోహ‌న్ రెడ్డి గ్రీన్‌సిగ్న్‌ల్ ఇచ్చారు.
AP CM YS Jagan Mohan Reddy Latest News Telugu
AP CM YS Jagan Mohan Reddy

మే 25వ తేదీ (గురువారం) ఉదయం ముఖ్యమంత్రికి అధికారులు ఈ పోస్టుల భర్తీపై వివరాలు అందించారు. 

నోటిఫికేషన్ విడుద‌ల‌కు అవసరమైన..
ముఖ్య‌మంత్రి ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు. నోటిఫికేషన్‌ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని తెలిపారు. 

☛ APPSC Group 2 New Syllabus 2023 Details : ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 కొత్త‌ సిల‌బ‌స్ ఇదే.. మొత్తం ఎన్ని పోస్టుల‌కు నోటిఫికేష‌న్ అంటే..?

గ్రూప్‌-1లో 100కు పైగా.. అలాగే గ్రూప్‌-2లో 900కి పైగా ఉద్యోగాల‌ను..

appsc group 1 and group 2 jobs news

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులను, అలాగే గ్రూప్‌-2కు సంబంధించి సుమారు 900కిపైగా పోస్టులతో క‌లిపి మొత్తంగా 1000కిపైగా పోస్టులు భర్తీచేయనున్నామని తెలిపారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేయాలని సీఎం ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 కొత్త‌ సిల‌బ‌స్ ఇదే.. మొత్తం ఎన్ని పోస్టుల‌కు నోటిఫికేష‌న్ అంటే..?

ఆంధ‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన కొత్త సిల‌బ‌స్‌ను ఏప్రిల్ 27వ తేదీ(గురువారం) విడుద‌ల చేసింది. అలాగే ఈ సారి గ్రూప్‌-2 దాదాపు 900 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చే అవ‌కాశం ఉంది.

ఈ కొత్త సిల‌బ‌స్ ప్ర‌కారం.. మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాతపరీక్షల ద్వారా  అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

చ‌ద‌వండి: Groups Preparation Tips: గ్రూప్స్‌..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్‌ కొట్టేలా!

మొదటి దశలో 150 మార్కులకు ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష, రెండో దశలో 300 మార్కులకు  మెయిన్ పరీక్ష  నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్ధులు మాత్రమే మెయిన్ పరీక్ష రాయడానికి అర్హులు.

Also read: APPSC Group 2 Notification 2022 : గ్రూప్‌–2 జాబ్ కొట్టే మార్గాలు ఇవే.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

సవరించిన సిలబస్ & పరీక్షా సరళి ప్రకారం.. 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీని మాత్రమే కలిగి ఉంటుంది. మెయిన్స్ పరీక్షలో జనరల్ స్టడీస్ మినహాయించబడింది. ఇది ఇప్పటికే ఉన్న స్కీమ్‌లో మూడింటికి బదులుగా ఒక్కొక్కటి 150 మార్కులకు రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది.

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్షావిధానం :

సబ్జెక్టు  ప్రశ్నలు మార్కులు
ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్ర 30 30
భూగోళ శాస్త్రం 30 30
భారతీయ సమాజం 30 30
కరెంట్ అఫైర్స్ 30 30
మెంటల్ ఎబిలిటీ 30 30
మొత్తం 150 150
     

ప‌రీక్ష స‌మ‌యం : 150 నిమిషాలు

చదవండి: ఏపీపీఎస్సీ ☛ స్టడీ మెటీరియల్ ☛ బిట్ బ్యాంక్ ☛ గైడెన్స్ ☛ ప్రీవియస్ పేపర్స్ ☛ సక్సెస్ స్టోరీస్ ☛ సిలబస్ ☛ ఆన్‌లైన్ టెస్ట్స్ ☛ ఆన్‌లైన్ క్లాస్ ☛ ఎఫ్‌ఏక్యూస్‌

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్ నూతన సిలబస్ ఇలా..

చరిత్ర : 30 మార్కులు
ప్రాచీన చరిత్ర : 

➤ సింధు లోయ నాగరికత 
➤ వేద కాలంనాటి  ముఖ్య లక్షణాలు -బౌద్ధమతం, జైనమతం ఆవిర్భావం 
➤ మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం : వారి పరిపాలన, సామాజిక-ఆర్థిక , మతపరమైన పరిస్థితులు, కళ, వాస్తు కళ, సాహిత్యం – హర్షవర్ధన, అతని విజయాలు.

మధ్యయుగ చరిత్ర : 
చోళ పరిపాలనా వ్యవస్థ – ఢిల్లీ సుల్తానులు, మొఘల్ సామ్రాజ్యం : వారి పరిపాలన, సామాజిక-ఆర్థిక, మతపరమైన పరిస్థితులు, కళ, వాస్తు కళ, భాష , సాహిత్యం – భక్తి, సూఫీ ఉద్యమాలు – శివాజీ, మరాఠా సామ్రాజ్యం వృద్ది – యూరోపియన్ల ఆగమనం.

చ‌ద‌వండి: Indian Polity Preamble Notes: వివాదాలు - సుప్రీంకోర్టు తీర్పులు.. ప్రముఖుల అభిప్రాయాలు 

ఆధునిక చరిత్ర : 
1857 తిరుగుబాటు, దాని ప్రభావం 
➤ బ్రిటిష్ వారు బలపడడం, ఏకీకరణ భారతదేశంలో అధికారం 
➤  పరిపాలన, సామాజిక, సాంస్కృతిక రంగాలలో మార్పులు
➤ సామాజిక, 19, 20వ శతాబ్దాలలో మత సంస్కరణ ఉద్యమాలు 
➤ భారత జాతీయ ఉద్యమం : దీని  వివిధ దశలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యమైన సహాయకులు మరియు రచనలు 
➤ స్వాతంత్యం తర్వాత ఏకీకరణ, దేశంలో పునర్వ్యవస్థీకరణ.

భూగోళ శాస్త్రం : 30 మార్కులు

సాధారణ, భౌతిక భౌగోళిక శాస్త్రం : మన సౌర వ్యవస్థలో భూమి – లోపలి భాగం భూమి – ప్రధాన భూరూపాలు, వాటి లక్షణాలు 
➤ వాతావరణం : వాతావరణం నిర్మాణం, కూర్పు  
➤ సముద్రపు నీరు : అలలు, కెరటాలు, ప్రవాహాలు 
➤ భారతదేశం, ఆంధ్ర ప్రదేశ్: ప్రధాన భౌతిక లక్షణాలు, వాతావరణం, నీటి పారుదల వ్యవస్థ, నేలలు, వృక్షసంపద 
➤ సహజ విపత్తులు.., వాటి నిర్వహణ.

చ‌ద‌వండి: APPSC Group 1, 2 Preparation Tips : గ్రూప్‌–1, 2 పోస్టుల పూర్తి వివరాలు ఇవే.. గ్రూప్స్ కొట్టాలంటే.. ఇలా చ‌ద‌వాల్సిందే.. 

భారతదేశం, ఏపీ ఆర్థిక భౌగోళిక శాస్త్రం : 
సహజ వనరులు, వాటి పంపిణీ 
➤ వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు 
➤ ప్రధాన పరిశ్రమలు, ప్రధాన పంపిణీ పారిశ్రామిక ప్రాంతాలు. 
➤రవాణా, కమ్యూనికేషన్, పర్యాటకం, వాణిజ్యం.

చ‌ద‌వండి: Geography Important Bit Bank: భారతదేశంలో మొట్టమొదటిగా కనుగొన్న చమురు క్షేత్రం ఏది? 

భారతదేశం, ఆంధ్రప్రదేశ్ మానవ భౌగోళిక శాస్త్రం :

మానవ అభివృద్ధి – జనాభా – పట్టణీకరణ మరియు వలస – జాతి, గిరిజన, మత మరియు భాషా సమూహాలు.

భారతీయ సమాజం : 30 మార్కులు
భారతీయ సమాజ నిర్మాణం: కుటుంబం, వివాహం, బంధుత్వం, కులం, తెగ, జాతి, మతం మరియు మహిళలు

సామాజిక సమస్యలు : 
కులతత్వం, మతతత్వం, ప్రాంతీయీకరణ, నేరానికి వ్యతిరేకంగా మహిళలు, బాలల దుర్వినియోగం మరియు బాల కార్మికులు, యువత అశాంతి, ఆందోళన

చ‌ద‌వండి: Indian Polity Bit Bank For All Competitive Exams:దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి? 

సంక్షేమ యంత్రాంగం : 
పబ్లిక్ పాలసీలు, సంక్షేమ కార్యక్రమాలు, రాజ్యాంగబద్ధం, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనారిటీలు, బీసీలకు చట్టబద్ధమైన నిబంధనలు, మహిళలు, వికలాంగులు, పిల్లలు.

కరెంట్ అఫైర్స్ : 30 మార్కులు

ప్రధాన సమకాలీన అంశాలు- సంబంధిత సమస్యలు
➤ అంతర్జాతీయ
➤ జాతీయ 
➤ ఆంధ్రప్రదేశ్

Also read: Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2కు కొత్త సిలబ‌స్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 28 Apr 2023 05:02PM

PDF

Published date : 25 May 2023 05:39PM

Photo Stories