APPSC Group 2 & 3 Jobs 2023 : ఇకపై గ్రూప్-2, 3 ఉద్యోగాలకు ఈ పరీక్ష తప్పనిసరిగా రాయాల్సిందే.. కొత్త నిబంధనలు ఇవే..
ఏపీపీఎస్సీ, ఏపీ సాంకేతిక విద్యా మండలి నిర్వహించే సీపీటీ పాస్ సర్టిఫికెట్ లేకుండా గ్రూపు-2, గ్రూపు-3 సర్వీసుల్లో నియామకానికి అవకాశం లేదంటూ అడహాక్ నిబంధనలు జారీ చేశారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా సీపీటీ పాస్ కావాల్సిందేనని స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-2, 3 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్ | టీఎస్‌పీఎస్సీ
ప్రస్తుతం గ్రూప్-1కు ఈ నిబంధనలు వర్తించవ్..
వంద మార్కులకు గానూ సీపీటీ నిర్వహించనున్నారు.ఈ 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో SC, ST, దివ్యాంగ అభ్యర్థులు 30 మార్కులు, బీసీలు 35, ఓసీలు 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది. కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్, ఇంటర్నెట్ తదితర అంశాల్లో పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రూపు-1 ఉద్యోగాలకు ఈ తాత్కాలిక నిబంధనలు వర్తించవంటూ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
☛ AP Government Jobs 2023 : గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు..
ఇటీవలే గ్రూప్-1 పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతున్న విషయం తెల్సిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల కాక.. త్వరలోనే మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. అలాగే గ్రూప్-2 ఉద్యోగాలకు కూడా త్వరలోనే నోఫికేషన్ విడుదల చేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
☛ APPSC Group 2 Notification 2022 : గ్రూప్–2 జాబ్ కొట్టే మార్గాలు ఇవే.. పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్ గైడెన్స్..