Skip to main content

Group 2 Exam Instructions: గ్రూప్‌-2 పరీక్ష రాసే అభ్యర్థులకు కీలక సూచనలు, ఇవి అస్సలు మర్చిపోవద్దు

Group 2 exam instructions

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను ఫిబ్రవరి 25వ తేదీన నిర్వ‌హించనున్నారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4.83 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షను ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు.

ఈ నేప‌థ్యంలో APPSC గ్రూప్‌-2 పరీక్ష రాసే అభ్యర్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పరీక్ష కేంద్రానికి ఏమేం తీసుకెళ్లాలి? వంటి విషయాలపై అభ్యర్థులకు సూచనలు..

1. హాల్‌టికెట్‌ను ముందురోజే దగ్గర ఉంచుకోండి. 
2. మీ ఎగ్జామ్‌ సెంటర్‌కి ఎలా వెళ్లాలో ప్లాన్‌ చేసుకోండి. 
3. ముందు రోజు రాత్రి బాగా నిద్రపోండి.
4. పెన్నులు, స్టేషనరీ వస్తువులను రెడీ చేసుకోండి. 
5. సబ్జెక్ట్‌ను ఓసారి రివైస్‌ చేసుకోండి. 
6. ఎగ్జామ్‌కి ముందు కనీసం 1.30 ముందు బ్రేక్‌ఫాస్ట్‌ చేయండి. 
7. ఎగ్జామ్‌ సెంటర్‌కి చేరుకునేందుకు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌, ఆటోల్లో కాకుండా సొంత వెహికిల్స్‌పై ప్రయాణం చేయండి. 
8. ఎగ్జామ్‌ సెంటర్‌ వేరే ఊరిలో ఉన్నా, దూరంగా ఉన్నా ఒకరోజు ముందే అక్కడికి చేరుకోవడం మంచిది. 
9. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎగ్జామ్‌ సెంటర్‌కి 1గంట ముందుగానే చేరుకునేలా ప్లాన్‌ చేసుకోండి. 
10. ఎగ్జామ్‌ హాల్‌లోకి అరగంట ముందే చేరుకోవాలి.  
11.  హాల్‌టికెట్‌ నెంబర్‌, మీ పేరు తదితర విషయాలను జాగ్రత్తగా ఫిల్‌ చేయండి. 
12. 50వేల మంది మెయిన్స్‌కు సెలక్ట్‌ అవుతారు... అందులో మీరు ఉంటామన్న నమ్మకంతో ఉండండి
13. కాన్ఫిడెంట్‌గా, కూల్‌గా ఉంటే అనవసరమైన తప్పులు చేయకుండా ఉంటారు. 
 

Published date : 24 Feb 2024 02:53PM

Photo Stories