Skip to main content

APPSC Group 2 Total Applications 2024 : ఏపీపీఎస్సీ గ్రూప్‌-2కు భారీగా ద‌ర‌ఖాస్తులు.. ఒక్కొక్క పోస్టుకు ఎంత మంది పోటీ అంటే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)కు భారీగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. 899 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.
APPSC Group-2 Recruitment   APPSC Group 2 Total Applications 2024 Details  APPSC Group-2 Recruitment Statistics

అలాగే గ్రూప్‌-2 ద‌ర‌ఖాస్తుకు జనవరి 17వ తేదీ (బుధ‌వారం) అర్ధరాత్రి 11.59 గంటల వరకు స‌మ‌యం ఇచ్చారు. దీంతో ఏపీపీఎస్సీ గ్రూప్‌-2కు దాదాపు 4,83,525 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. అంటే ఒక్కొక్క ఉద్యోగానికి 537 మంది పోటీప‌డుతున్నారు. గ్రూప్‌-2  స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించనున్నారు. అలాగే గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు  APPSC శుభవార్త చెప్పింది. మీరు ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ద‌ర‌ఖాస్తు చేసే స‌మ‌యంలో ఏమైన పొర‌పాట్లు జ‌రిగితే.. వీటిని స‌రిదిద్దుకునే అవ‌కాశం ఏపీపీఎస్సీ క‌ల్పించింది. ఈ అవ‌కాశం కొద్ది రోజులు మాత్ర‌మే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

☛ APPSC Group-1&2 ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

☛ APPSC Group 2 ద‌రఖాస్తు చేసిన అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్ లింక్ ఇదే..

Published date : 22 Jan 2024 12:45PM

Photo Stories