Skip to main content

APPSC Group-2 PostPoned : గ్రూప్-2 పరీక్ష వాయిదా వేసే అవకాశం ఉందా..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) జూలై 28వ తేదీన‌ నిర్వ‌హించ‌నున్న గ్రూప్-2 మెయిన్స్ ప‌రీక్ష‌ను వాయిదా వేయాలంటూ అభ్యర్థుల డిమాండ్ చేస్తున్నారు.
APPSC officials in a meeting discussing exam postponement requests  APPSC Group 2 Mains 2024 PostPoned   Candidates demanding postponement of Group-II Mains examination

కొంత మంది అభ్యర్థులు గ్రూప్‌-2 వాయిదా వేయమని ఇప్పటికే మంత్రిని కోరారు. సిలబస్‌లో మార్పులు చేయడంతో పాటు.. ఎన్నికల ప్రక్రియ వల్ల పూర్తి స్థాయిలో పరీక్షకు ప్రిపేర్‌ కాలేకపోయామంటూ పరీక్షకు మరికొంత సమయం పెంచాలంటూ పలువురు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ విన్నపాలపై  ఏపీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

MLCలు సైతం గ్రూప్-2 మెయిన్స్ ప‌రీక్ష‌ను వాయిదా వేయాలంటూ..

అలాగే ఇటీవ‌లే గ్రూప్-2 మెయిన్స్ ప‌రీక్ష‌ను వాయిదా వేయాలంటూ.. ఏపీపీఎస్సీ సెక్ర‌ట‌రీని టీడీపీ MLCలు సైతం కోరారు. ఈ మేర‌కు MLCలు వేపాడ చిరంజీవిరావు, భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి, కంచ‌ర్ల శ్రీకాంత్ ఏపీపీఎస్సీ సెక్ర‌ట‌రీని క‌లిసి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ ప‌రీక్ష నిర్వ‌హిస్తే అభ్య‌ర్థులు ఎదుర్కొనే స‌వాళ్ల‌ను ఏపీపీఎస్సీ సెక్ర‌ట‌రీకి వివ‌రించారు. APPSC గ్రూప్-2 మెయిన్స్‌కు 92,250 మంది అర్హ‌త సాధించారు.

Published date : 26 Jun 2024 08:16AM

Photo Stories