Skip to main content

Group-2 Prelims: గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్షలో విద్యార్థుల ప్రతిభ..!

ప్రిలిమ్స్‌ పరీక్షలో తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను అభినందించారు ఐటీడీఏ పీఓ సూర్యతేజ..
Students talent in APPSC Group 2 Prelims 2024 as results are out

బుట్టాయగూడెం: కేఆర్‌పురం ఐటీడీఏ ఆధ్వర్యంలో వైటీసీలో శిక్షణ పొందిన 9 మంది అభ్యర్థులు ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించినట్లు ఐటీడీఏ పీఓ ఎం.సూర్యతేజ తెలిపారు. శుక్రవారం తన చాంబర్‌లో వారిని అభినందించారు.

Inter Board: గురుకుల సొసైటీల ఇష్టారాజ్యం!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 70 మందికి 25 రోజులపాటు ఉచిత శిక్షణ అందించగా 9 మంది ప్రతిభ కనబర్చడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో గ్రూప్‌–2 మెయిన్స్‌లో కూడా సత్తాచాటాలని ఆకాంక్షించారు. వీరికి మెయిన్స్‌ శిక్షణ కూడా అందిస్తామన్నారు. ఇన్‌చార్జి డీడీ పీవీఎస్‌ నాయుడు పాల్గొన్నారు.

Intermediate Results 2024 : ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలు సత్తా

Published date : 13 Apr 2024 03:51PM

Photo Stories