Skip to main content

APPSC Group 2 Prelims Results 2024 Released : బ్రేకింగ్ న్యూస్‌.. గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల‌.. మెయిన్స్ ప‌రీక్ష తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎట్ట‌కేల‌కు.. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (APPSC) గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. 899 పోస్టుల‌కు గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. గ్రూప్‌-2 ప్రిలిమ్స్ 2024 పరీక్షకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
appsc group 2 prelims 2024 results
appsc group 2 prelims result 2024

అలాగే 4,63,517 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోగా 4,04,037 మంది అంటే.. (87.17) శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ఫ‌లితాల‌తో పాటు.. ఫైన‌ల్ కీ ని కూడా విడుద‌ల చేశారు.

APPSC Group-2 ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణ‌త సాధించిన వారు..మెయిన్స్ ప‌రీక్ష రానున్నారు. APPSC Group-2 మెయిన్స్ ప‌రీక్ష‌ను 2024 జూలై 28వ తేదీన నిర్వ‌హించ‌నున్నారు. మొత్తం 92250 మంది మెయిన్స్‌కు అర్హ‌త సాధించారు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్‌ పరీక్షను రెండు పేపర్లుగా 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌–1లో సెక్షన్‌–1: సోషల్‌ హిస్టరీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఆంధ్రప్రదేశ్‌లోని సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు); సెక్షన్‌–2: భారత రాజ్యాంగం సమీక్షల నుంచి 150 ప్రశ్నలు (150 మార్కులు) అడుగుతారు. పేపర్‌–2లో సెక్షన్‌–1: భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థ; సెక్షన్‌–2 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీల నుంచి 150 ప్రశ్నలు(150 మార్కులు) అడుగుతారు.

APPSC గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ఫ‌లితాలు ఇవే.. మెయిన్స్‌కు వ‌చ్చిన వారు వీరే..

Published date : 10 Apr 2024 06:29PM

Photo Stories