Students for APPSC Mains: ఏపీపీఎస్‌సీ గ్రూప్-2 మెయిన్స్‌కు అర్హత సాధించిన విద్యార్థులు వీరే..!
పాడేరు: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్షల్లో 43 మంది గిరిజన విద్యార్థులు విజయం సాధించి మెయిన్స్‌కు అర్హత సాధించారని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి. అభిషేక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో విశాఖ నగరంలోని వేపగుంట వైటీసీలో 60 మంది సివిల్స్ శిక్షణ పొందుతున్నారు.
Government Jobs: పిల్లులకు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇల్లు, తినడానికి తిండి ఫ్రీ.. ఎక్కడంటే..
వీరిలో 59 మంది విద్యార్థులు ఇటీవల నిర్వహించిన గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్ష రాయగా 43 మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. వీరిని పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్‌తో పాటు శిక్షణ అందిస్తున్న 21వ సెంచరీ సంస్థ నిర్వాహకులు అభినందించారు. ఇదే స్ఫూర్తితో మెయిన్స్‌లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు.
Education System: పాఠశాలల రూపురేకల మార్పులపై ప్రశంసలు.. ఉపాధ్యాయుల బదిలీలు ఇలా!