Group-2 Prelims Arrangements: అత్యంత పకడ్బందీగా నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష..
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాలో గ్రూప్–2 స్క్రీనింగ్ పరీక్ష సజావుగా సాగింది. అభ్యర్థుల హాజరు 84 శాతంగా నమోదయ్యింది. 32,391 మంది అభ్యర్థులకు గానూ 27,324 మంది హాజరయ్యారు. 5,067 మంది గైర్హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 111 కేంద్రాల్లో అత్యంత పకడ్బందీగా పరీక్ష నిర్వహించారు.
Women Job Offer: 27న మహిళలకు జాబ్ మేళా..
38 మంది రూట్ అధికారులు, 111 మంది లైజన్ అధికారులు విధులు నిర్వర్తించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించారు. ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణను ఏపీపీఎస్‌సీ డిప్యూటీ సెక్రటరీ డి.అపరంజని, సెక్షన్ ఆఫీసర్లు పి.వి.నవజ్యోతి, జె.యశోద పర్యవేక్షించారు.
10th Class: ‘పది’పై ఫోకస్... వసతిగృహాల్లో స్టడీఅవర్స్..
ఎస్పీ తనిఖీ..
నగరంలో పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పరిశీలించారు. ఎస్‌ఎస్‌బీఎన్, ఆర్ట్స్ కళాశాల, సెయింట్ ఆన్స్ కళాశాలల్లో కేంద్రాలను తనిఖీ చేశారు. పోలీసు బందోబస్తును సమీక్షించారు. ఎస్పీతో పాటు పోలీసు అధికారులు ఉన్నారు.