Geography Important Bit Bank: భారతదేశంలో మొట్టమొదటిగా కనుగొన్న చమురు క్షేత్రం ఏది?
1. బొగ్గు నిల్వలు భారతదేశంలోని కింది ఏ నదీ లోయలో లభించవు?
ఎ) దామోదర్
బి) నర్మద
సి) మహానది
డి) సోన్
- View Answer
- సమాధానం: బి
2. టైపామ్ శ్రేణి అవక్షేప శిలల్లో ఏ ఖనిజ వనరులు లభిస్తున్నాయి?
ఎ) బొగ్గు
బి) యురేనియం
సి) చమురు
డి) థోరియం
- View Answer
- సమాధానం: సి
3. నైవేలిలో ఏ రకమైన బొగ్గు లభిస్తుంది?
ఎ) ఆంథ్రసైట్
బి) బిట్యూమినస్
సి) లిగ్నైట్
డి) పీట్
- View Answer
- సమాధానం: సి
4. బూడిద శాతం ఏ రకమైన బొగ్గులో ఎక్కువగా ఉంటుంది?
ఎ) ఆంథ్రసైట్
బి) బిట్యూమినస్
సి) లిగ్నైట్
డి) పీట్
- View Answer
- సమాధానం: డి
5. భారతదేశంలో మోనజైట్ నిల్వలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం?
ఎ) తమిళనాడు
బి) మహారాష్ట్ర
సి) కేరళ
డి) ఒడిశా
- View Answer
- సమాధానం: సి
6. టెరిషరీ భౌమ్య యుగానికి చెందిన బొగ్గు నిల్వలు భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉన్నాయి?
ఎ) చోటానాగపూర్ పీఠభూమి
బి) మహారాష్ట్ర
సి) పశ్చిమ భారతదేశం
డి) ఈశాన్య భారతదేశం
- View Answer
- సమాధానం: డి
7. భారతదేశంలో బొగ్గు నిల్వలు సుమారుగా ఎన్ని టన్నులు?
ఎ) 250 మిలియన్
బి) 250 బిలియన్
సి) 100 మిలియన్
డి) 100 బిలియన్
- View Answer
- సమాధానం: బి
8. తెలంగాణలోని కింది జిల్లాలో బొగ్గు నిల్వలు లేవు?
1) ఖమ్మం
2) వరంగల్
3) కరీంనగర్
4) ఆదిలాబాద్
ఎ) 2
బి) 2, 3
సి) 1
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: డి
9. తెలంగాణలో బొగ్గును ఉత్పత్తి చేసే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) కొత్తగూడెం
బి) రామగుండం
సి) సింగరేణి
డి) హైదరాబాద్
- View Answer
- సమాధానం: ఎ
10. పీట్ తరగతికి చెందిన బొగ్గు నిల్వలు ప్రధానంగా ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి?
ఎ) ఛత్తీస్‌గఢ్
బి) జమ్ము
సి) తమిళనాడు
డి) కేరళ
- View Answer
- సమాధానం: డి
11. భారతదేశంలో అత్యధిక నిల్వలు ఉన్న అతిపెద్ద బొగ్గు క్షేత్రం ఏది?
ఎ) ఝరియా
బి) రాణిగంజ్
సి) గిర్ది
డి) సింగరేణి
- View Answer
- సమాధానం: బి
12. కింద సూచించిన వాటిలో బొగ్గు గని కేంద్రాలను గుర్తించండి.
1) భూపాలపల్లి
2) సత్తుపల్లి
3) మణుగూరు
4) మందమర్రి
ఎ) 1, 2
బి) 3, 4
సి) 1, 3, 4
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
13. కోకింగ్ బొగ్గు ప్రధానంగా దేశంలో ఎక్కడ లభిస్తుంది?
ఎ) ఝరియా
బి) కోర్బా
సి) సింగ్రౌలి
డి) తాల్చేర్
- View Answer
- సమాధానం: ఎ
14. భారతదేశం ప్రధానంగా ఏ దేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటుంది?
1) ఆస్ట్రేలియా
2) యూఎస్ఏ
3) దక్షిణాఫ్రికా
4) చైనా
ఎ) 1, 2
బి) 1, 3
సి) 2, 3
డి) 1, 4
- View Answer
- సమాధానం: డి
15. భారతదేశంలో నీటి ముంపు వల్ల అతి పెద్ద దుర్ఘటన జరిగిన బొగ్గుగని ?
ఎ) తాల్చేర్
బి) బొకారో
సి) చస్నాలా
డి) గోదావరిఖని
- View Answer
- సమాధానం: సి
16. భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి చేసే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (ఇఐఔ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) ధన్‌బాద్
బి) ఢిల్లీ
సి) కలకత్తా
డి) నాగపూర్
- View Answer
- సమాధానం: సి
17. అంబానీ చమురు క్షేత్రం ఏ ప్రాంతంలో ఉంది?
ఎ) కావేరి బేసిన్
బి) కె.జి. బేసిన్
సి) కాంబత్ సింధుశాఖ
డి) బ్రహ్మపుత్ర లోయ
- View Answer
- సమాధానం: బి
18. భారతదేశంలో అత్యధికంగా చమురును ఉత్పత్తి చేసే అతిపెద్ద చమురు క్షేత్రం ?
ఎ) గాంధార్
బి) రవ్వ
సి) దిగ్బాయ్
డి) ముంబై హై
- View Answer
- సమాధానం: డి
19. భారత ప్రభుత్వం ఒఎన్జీసీ (ONGC) కింద సూచించిన ఏ విదేశీ చమురు క్షేత్రంలో పెట్టుబడి పెట్టింది?
ఎ) అంపారా
బి) డహరాన్
సి) సఖాలిన్
డి) బాకు
- View Answer
- సమాధానం: సి
20. భారతదేశంలో మొట్టమొదటిగా కనుగొన్న చమురు క్షేత్రం?
ఎ) లూనెజ్ బేసిన్
బి) దిగ్బాయ్
సి) నహకర్తియా
డి) నారిమన్నం
- View Answer
- సమాధానం: బి
21. వాయవ్య భారతదేశంలో కింది ప్రాంతంలో చమురు సహజవాయువు నిల్వలున్నట్లుగా నిర్ధారించారు?
ఎ) థార్ ఎడారి
బి) చంబల్ లోయ
సి) కచ్ మైదానం
డి) సట్లెజ్–యమునా మైదానం
- View Answer
- సమాధానం: ఎ
22. HBJ పైపు లైను మార్గం కింది రాష్ట్రాల గుండా వెళ్తుంది?
ఎ) మహారాష్ట్ర–గుజరాత్–రాజస్థాన్
బి) గుజరాత్–మధ్యప్రదేశ్–ఉత్తరప్రదేశ్
సి) గుజరాత్–మధ్యప్రదేశ్–రాజస్థాన్
డి) గుజరాత్–మహారాష్ట్ర–మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: బి
23. కింద సూచించిన ప్రదేశాల్లో చమురు శుద్ధి కర్మాగారం లేదు?
ఎ) బరౌని
బి) పానిపట్
సి) బోన్గాయిగావ్
డి) రాంచీ
- View Answer
- సమాధానం: డి
24. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రంగా రూపొందిన భారతీయ నగరమేది?
ఎ) దిగ్బాయ్
బి) ట్రాంబే
సి) జామ్‌నగర్
డి) వడోదర
- View Answer
- సమాధానం: సి
25. ఏ రెండు పట్టణాలు / నగరాలను కలుపుతూ చమురు – సహజవాయువు గొట్టపు మార్గాన్ని నిర్మిస్తున్నారు?
ఎ) విజయవాడ–విశాఖపట్నం
బి) కాకినాడ–విశాఖపట్నం
సి) హైదరాబాద్–కాకినాడ
డి) హైదరాబాద్–విశాఖపట్నం
- View Answer
- సమాధానం: బి
26. జతపరచండి.
a) నహర్కతియా 1) గుజరాత్
b) గాంధార్ 2) అసోం
c) కర్సాంగ్ 3) మహారాష్ట్ర
d) బేసిన్ 4) అరుణాచల్‌ప్రదేశ్
ఎ) a- 1 b- 2 c- 4 d- 3
బి) a- 1 b- 2 c- 3 d- 4
సి) a- 2 b- 1 c- 4 d- 3
డి) a- 2 b- 1 c- 3 d- 4
- View Answer
- సమాధానం: సి
27. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లుగా నిర్ధారించారు?
ఎ) నల్లగొండ, కడప
బి) నల్లగొండ, అనంతపురం
సి) వరంగల్, కడప
డి) వరంగల్, కర్నూల్
- View Answer
- సమాధానం: ఎ
28. జాదుగుడా ఏ ఖనిజాన్ని ఉత్పత్తి చేసే గని కేంద్రం?
ఎ) బొగ్గు
బి) చమురు
సి) యురేనియం
డి) థోరియం
- View Answer
- సమాధానం: సి
29. ఈశాన్య భారతదేశంలో యురేనియం ఖనిజం ఎక్కడ లభిస్తుంది?
ఎ) ఖాసీ కొండలు
బి) గారో కొండలు
సి) నాగా కొండలు
డి) మిష్మి కొండలు
- View Answer
- సమాధానం: ఎ
30. ప్రపంచంలో అత్యధికంగా మోనజైట్ నిల్వలు కలిగి ఉన్న దేశం ?
ఎ) ఆస్ట్రేలియా
బి) భారతదేశం
సి) కెనడా
డి) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: బి
31. మోనజైట్ ముడి ఖనిజంలోని ప్రధాన ఖనిజం ఏది?
ఎ) యురేనియం
బి) ప్లుటోనియం
సి) థోరియం
డి) బెరీలియం
- View Answer
- సమాధానం: సి
32. భారతదేశంలో జిర్కాన్ ఇల్మనైట్ వంటి అణు ఖనిజాలను ఉత్పత్తి చేసే సంస్థ ?
ఎ) యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
బి) ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్
సి) ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్
డి) మినరల్ ఎక్సొప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: బి
33. ఆంధ్రప్రదేశ్‌లో మోనజైట్ నిక్షేపాలు ఏ తీరంలో లభిస్తున్నాయి?
ఎ) నెల్లూరు
బి) మచిలీపట్నం
సి) కాకినాడ
డి) భీమునిపట్నం
- View Answer
- సమాధానం: డి
34. భారతదేశంలోని కింది ప్రాంతంలో చమురు–సహజవాయువు నిల్వలు బయటపడే అవకాశాలున్నాయి.
ఎ) దక్కన్ పీఠభూమి
బి) చోటానాగపూర్ పీఠభూమి
సి) ఒడిశా తీరం
డి) సట్లెజ్–యమునా మైదానం
- View Answer
- సమాధానం: డి
35. చమురు–సహజవాయువు నిల్వలు సముద్ర భూతలంపై కింది ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటాయి?
ఎ) ఖండ తీరపు అంచు
బి) ఖండ తీరపు వాలు
సి) ఆబిసల్ మైదానం
డి) అగాధ సముద్ర ప్రాంతాలు
- View Answer
- సమాధానం: ఎ
36. కేంద్రీయ గనుల పరిశోధన కేంద్రం (CMRS) ఎక్కడ ఉంది?
ఎ) రాంచీ
బి) కలకత్తా
సి) దుర్గాపూర్
డి) ధన్‌బాద్
- View Answer
- సమాధానం: డి