Indian Geography Quiz in Telugu: అరిచే జింకలు ఉన్న జాతీయ పార్కు ఏది?
మాదిరి ప్రశ్నలు
1. బంగ్లాదేశ్‌లో గంగానదిని ఏమని పిలుస్తారు?
1) కర్ణావతి
2) భాగీరథి
3) జమున
4) పద్మ
- View Answer
- సమాధానం: 4
2. కింది వాటిలో గంగానది ఒడ్డున లేని నగరం ఏది?
1) వారణాసి
2) అలహాబాద్
3) కాన్పూర్
4) లక్నో
- View Answer
- సమాధానం: 4
3. జతపరచండి.
జాబితా I
i) కుమవున్ హిమాలయాలు
ii) నేపాల్ హిమాలయాలు
iii) పంజాబ్ హిమాలయాలు
iv) అసోం హిమాలయాలు
జాబితా II
a) ఇండస్, సట్లెజ్ మధ్య
b) కాళీ, తీస్తా మధ్య
c) తీస్తా, బ్రహ్మపుత్ర మధ్య
d) సట్లెజ్, కాళీ మధ్య
1) i-c, ii-d, iii-b, iv-a
2) i-c, ii-b, iii-d, iv-a
3) i-d, ii-b, iii-a, iv-c
4) i-d, ii-c, iii-a, iv-b
- View Answer
- సమాధానం: 3
4. సాత్పురా, వింధ్య పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది?
1) నర్మద
2) గండక్
3) తపతి
4) గోదావరి
- View Answer
- సమాధానం: 1
5. భారతదేశంలో బ్రహ్మపుత్ర నది మొదట ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది?
1) అసోం
2) త్రిపుర
3) సిక్కిం
4) అరుణాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
చదవండి: Geography Notes for Group 1, 2: రాణిగంజ్.. దేశంలోని అతిపెద్ద బొగ్గు క్షేత్రం
6. కజిరంగా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?
1) అసోం
2) బిహార్
3) పశ్చిమ బెంగాల్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 1
7. కింది వాటిలో సరైన జత ఏది?
1) బందీపూర్ – తమిళనాడు
2) మానస్ – ఉత్తరప్రదేశ్
3) రణతంబోర్ – రాజస్థాన్
4) సిమ్లిపాల్ – జార్ఖండ్
- View Answer
- సమాధానం: 3
8. ‘ఘనా’పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఒడిశా
2) కర్ణాటక
3) రాజస్థాన్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 3
9. కింది వాటిలో బయోస్ఫియర్ రిజర్వ్ కానిది ఏది?
1) అగస్త్యమలై
2) నల్లమలై
3) నీలగిరి
4) పంచమర్హి
- View Answer
- సమాధానం: 2
10. భారతదేశంలో తొలి జీవ వైవిధ్య రక్షిత స్థలాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) గ్రేట్ నికోబార్
2) గల్ఫ్ ఆఫ్ మన్నార్
3) నందాదేవి
4) నీలగిరి
- View Answer
- సమాధానం: 4
11. ప్రసిద్ధి చెందిన ‘కన్హ వన్యమృగ సంరక్షణ కేంద్రం’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) బిహార్
2) మధ్యప్రదేశ్
3) కర్ణాటక
4) అసోం
- View Answer
- సమాధానం: 2
చదవండి: Geography Notes for Group 1, 2 Exams: అరణ్యాలు... దేశంలో అత్యధిక వర్షపాతాన్ని పొందే తీరం ఏది?
12. కేరళలోని ఏ అభయారణ్యం ఏనుగులకు ప్రసిద్ధి చెందింది?
1) పరకల్
2) పెరియార్
3) చంద్రప్రభ
4) కన్హ
- View Answer
- సమాధానం: 2
13. జతపరచండి.
జాబితా – I జాబితా – II
i) సిమ్లిపాల్ a) ఉత్తరప్రదేశ్
ii) బందీపూర్ b) ఒడిశా
iii) మానస్ c) కర్ణాటక
iv) చంద్రప్రభ d) అసోం
1) i-c, ii-d, iii-a, iv-b
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-b, ii-c, iii-d, iv-a
4) i-a, ii-b, iii-c, iv-d
- View Answer
- సమాధానం: 3
14. ‘సైలెంట్ వ్యాలీ’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) తమిళనాడు
2) కేరళ
3) అసోం
4) అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
15. ‘రంగనతిట్టు’ పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
1) కేరళ
2) అసోం
3) రాజస్థాన్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 4
16. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
1) జూన్ 5
2) జూన్ 9
3) అక్టోబర్ 5
4) సెప్టెంబర్ 10
- View Answer
- సమాధానం: 1
17. భారత్‌లో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏది?
1) గిర్ అడవి (గుజరాత్)
2) బందీపూర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (కర్ణాటక)
3) నాగార్జున శ్రీశైలం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ)
4) దండకారణ్యం (ఛత్తీస్‌గఢ్)
- View Answer
- సమాధానం: 3
18. మధ్యప్రదేశ్‌లోని ‘పన్నా’ నేషనల్ పార్కు ద్వారా ప్రవహించే నది ఏది?
1) నర్మద
2) తపతి
3) కెన్
4) సట్లెజ్
- View Answer
- సమాధానం: 3
19. కింది వాటిలో ఖడ్గ మృగాలకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్కు ఏది?
1) దచిగామ్
2) సలీం అలీ
3) రోహులా
4) జల్దపార
- View Answer
- సమాధానం: 4
20. భారత్‌లో ఏర్పాటు చేసిన తొలి జాతీయ పార్కు ఏది?
1) గిర్ నేషనల్ పార్క్
2) జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్
3) సిమ్లిపాల్ నేషనల్ పార్క్
4) జల్దపార నేషనల్ పార్క్
- View Answer
- సమాధానం: 2
21. భారతదేశంలో తొలి పక్షి సంరక్షణ కేంద్రం ఏది?
1) వేదాంతంగల్
2) రంగనతిట్టు
3) ఘనా
4) కొల్లేరు
- View Answer
- సమాధానం: 1
22. జాతీయ పార్కులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) గిండి జాతీయ పార్కు – తమిళనాడు
2) వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్కు – ఉత్తరాఖండ్
3) దుద్వా జాతీయ పార్కు – ఉత్తరప్రదేశ్
4) వాల్మీకి జాతీయ పార్కు – చత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 4
23. భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు?
1) 1954
2) 1964
3) 1972
4) 1986
- View Answer
- సమాధానం: 3
24. ‘నామ్దఫా’ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) అసోం
2) అరుణాచల్ ప్రదేశ్
3) బిహార్
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 2
25. జతపరచండి.
టైగర్ రిజర్వ్ రాష్ట్రం
i) నామేరి a) కర్ణాటక
ii) కవ్వాల్ b) చత్తీస్‌గఢ్
iii) ఇంద్రావతి c) తెలంగాణ
iv) బద్రా d) అసోం
1) i-b, ii-c, iii-a, iv-d
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-a, ii-c, iii-d, iv-b
4) i-b, ii-d, iii-a, iv-c
- View Answer
- సమాధానం: 2
26. రోహులా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరాఖండ్
2) హిమాచల్ ప్రదేశ్
3) ఉత్తరప్రదేశ్
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 2
చదవండి: టీఎస్పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్లైన్ క్లాస్ | ఆన్లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
27. ‘గరమ్ పానీ’ శాంక్చుయరీ ఏ రాష్ట్రంలో ఉంది?
1) రాజస్థాన్
2) మధ్యప్రదేశ్
3) ఉత్తర ప్రదేశ్
4) అసోం
- View Answer
- సమాధానం: 4
28. కింది వాటిలో రాజస్థాన్‌కు చెందని వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏది?
1) సరిస్క
2) రామ్‌గఢ్ బందీ
3) తీర్థాన్
4) ఫల్వారి
- View Answer
- సమాధానం: 3
29. వన్య మృగ సంరక్షణ కేంద్రాలకు సంబం«ధించి కింది వాటిలో సరికాని జత ఏది?
1) భీమ బంధ్ – బిహార్
2) డచిగామ్ – జమ్ము–కశ్మీర్
3) హజారీ బాగ్ – జార్ఖండ్
4) దండేలి – ఒడిశా
- View Answer
- సమాధానం: 4
30. కింది వాటిలో యునెస్కో జాబితాలో లేని భారత బయోస్ఫియర్ రిజర్వ్ ఏది?
1) సుందర్బన్స్
2) కాంచన గంగ
3) మన్నార్ సింధు శాఖ
4) నందా దేవి
- View Answer
- సమాధానం: 2
31. ‘ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టు’ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1952
2) 1972
3) 1973
4) 1985
- View Answer
- సమాధానం: 3
32. ‘సత్‌కోషియా’ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) అసోం
2) ఒడిశా
3) కర్ణాటక
4)రాజస్థాన్
- View Answer
- సమాధానం: 2
33. ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఉన్న ‘గహిర్మాత బీచ్’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) తమిళనాడు
2) గుజరాత్
3) పశ్చిమ బెంగాల్
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 4
34. భారత్‌లో ‘ఆపరేషన్ క్రొకడైల్’ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1972
2) 1973
3) 1975
4) 1985
- View Answer
- సమాధానం: 3
35. మనదేశంలో మొసళ్ల సంరక్షణకు ‘క్రొకడైల్ బ్యాంక్’ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) కోల్‌కతా
2) విశాఖపట్నం
3) ముంబై
4) చెన్నై
- View Answer
- సమాధానం: 4
36. ‘సంజయ్ దుబ్రి టైగర్ రిజర్వ్’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) తమిళనాడు
2) మధ్యప్రదేశ్
3) న్యూఢిల్లీ
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
37. 11వ ప్రపంచ జీవ వైవిధ్య సదస్సును ఎక్కడ నిర్వహించారు?
1) కాన్కున్
2) ఢిల్లీ
3) హైదరాబాద్
4) కౌలాలంపూర్
- View Answer
- సమాధానం: 3
38. ఆసియా సింహాలకు ఆవాసమైన ‘గిర్’ జంతు సంరక్షణ కేంద్రం ఏ ప్రాంతంలో ఉంది?
1) జునాగఢ్
2) భావనగర్
3) గాంధీనగర్
4) కాంబే
- View Answer
- సమాధానం: 1
39. కింది వాటిలో సరికానిది ఏది?
1) ఏనుగులకు సంబంధించిన ప్రాజెక్టు (ప్రాజెక్టు ఎలిఫెంట్)ను 1992లో ప్రారంభించారు
2) ప్రాజెక్టు ఎలిఫెంట్ ప్రకారం, ఏనుగులు ఉండే ప్రాంతాన్ని గ్రీన్, ఎల్లో, రెడ్ మూడు ప్రాంతాలుగా విభజించారు
3) భారతదేశంలో అతి వేగంగా అంతరించిపోతున్న తాబేళ్ల జాతి.. ఆలివ్ రిడ్లే తాబేళ్లు
4) ‘ఆపరేషన్ కార్బెట్ సీ టర్టిల్’ అనే కార్యక్రమాన్ని 1975లో ప్రారంభించారు
- View Answer
- సమాధానం: 3
40. రాజాజీ, కార్బెట్ ఏనుగుల రిజర్వ్‌లు ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి?
1) ఉత్తరప్రదేశ్, బిహార్
2) మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్
3) మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్
4) ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: 4
41. ‘కోల్డ్ డెజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) హిమాచల్‌ప్రదేశ్
2) మధ్యప్రదేశ్
3) మేఘాలయ
4) అసోం
- View Answer
- సమాధానం: 1
42. జాతీయ పార్కులు, అవి ఉన్న ప్రాంతాలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది?
1) కిష్టవార్ – జమ్ము–కశ్మీర్
2) బోర్విల్లీ – ఉత్తరప్రదేశ్
3) బన్నార్ గట్టా – కర్ణాటక
4) మాధవ్ – మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
చదవండి: Geography Important Bit Bank: భారతదేశంలో మొట్టమొదటిగా కనుగొన్న చమురు క్షేత్రం ఏది?
43. కింది వాటిలో అరిచే జింకలు ఉన్న జాతీయ పార్కు ఏది?
1) గిండి జాతీయ పార్కు
2) శివపురి జాతీయ పార్కు
3) దుద్వా జాతీయ పార్కు
4) బోర్విల్లీ జాతీయ పార్కు
- View Answer
- సమాధానం: 4
44. ‘రాణి ఝాన్సీ’ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉన్న ప్రాంతం ఏది?
1) మధ్యప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
3) బిహార్
4) అండమాన్ నికోబార్
- View Answer
- సమాధానం: 4
45. ‘సంజయ్ గాంధీ నేషనల్ పార్కు’ అని దేన్ని పిలుస్తారు?
1) బోర్విల్లీ నేషనల్ పార్కు
2) కజిరంగా నేషనల్ పార్కు
3) నాగర్సోల్ నేషనల్ పార్కు
4) శివపురి నేషనల్ పార్కు
- View Answer
- సమాధానం: 1
46. ‘ఇంటాంకీ’ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
1) మణిపూర్
2) నాగాలాండ్
3) మిజోరాం
4) అసోం
- View Answer
- సమాధానం: 2
47. 2016లో 13వ ప్రపంచ జీవ వైవిధ్య సదస్సును ఎక్కడ నిర్వహించారు?
1) బాన్
2) హేగ్
3) హైదరాబాద్
4) కాన్కున్
- View Answer
- సమాధానం: 4
48. ‘భగవాన్ మహావీర్’ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?
1) మహారాష్ట్ర
2) తెలంగాణ
3) గోవా
4) సిక్కిం
- View Answer
- సమాధానం: 3
49. కింది వాటిలో సరికాని జత ఏది?
1) నందన్ కానన్ నేషనల్ పార్కు – ఒడిశా
2) సోనాయ్ రూపాయ్ వన్యమృగ సంరక్షణ కేంద్రం – అసోం
3) నవగావ్ జాతీయ పార్కు–పశ్చిమ బెంగాల్
4) అన్షి జాతీయ పార్కు – కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
50. డాక్టర్ సలీం అలీ బర్డ్ శాంక్చుయరీ ఎక్కడ ఉంది?
1) గోవా
2) కేరళ
3) తమిళనాడు
4) అసోం
- View Answer
- సమాధానం: 1
51. ‘ఇందిరాగాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీ’ అని దేన్ని పిలుస్తారు?
1) పెరియార్ శాంక్చుయరీ
2) షికారీ దేవి శాంక్చుయరీ
3) రంగనతిట్టు బర్డ్ శాంక్చుయరీ
4) అన్నామలై శాంక్చుయరీ
- View Answer
- సమాధానం: 4
52. ‘గోవింద్ పశు విహార్’ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరప్రదేశ్
2) రాజస్థాన్
3) మహారాష్ట్ర
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 1
53. ‘భిత్తర్ కానికా’ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
1) తమిళనాడు
2) కేరళ
3) గోవా
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 4
54. చంబల్, బెట్వా, కెన్లు ఏ నదికి ఉపనదులు?
1) నర్మద
2) తపతి
3) యమున
4) దామోదర్
- View Answer
- సమాధానం: 4
55. కింది వాటిలో పెన్నా నదికి ఉపనది కానిది ఏది?
1) కుందేరు
2) సగిలేరు
3) లోకపావని
4) చెయ్యేరు
- View Answer
- సమాధానం: 3
56. సోన్ నది గంగానదిలో ఎక్కడ కలుస్తుంది?
1) అలహాబాద్
2) పాట్నా
3) రుద్ర ప్రయాగ
4) చా్రపా
- View Answer
- సమాధానం: 2
57. నర్మదానది దేశంలో ఏయే రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తోంది?
1) ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్
2) ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్
3) మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్
4) మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్
- View Answer
- సమాధానం: 3
58. దిబాంగ్, లోహిత్ ఏ నదికి ఉపనదులు?
1) గంగా
2) సింధు
3) యమున
4) బ్రహ్మపుత్ర
- View Answer
- సమాధానం: 4
59. గంగా నది ఏ రాష్ట్రంలో అత్యధిక దూరం ప్రవహిస్తోంది?
1) పశ్చిమ బెంగాల్
2) ఉత్తరప్రదేశ్
3) బిహార్
4) ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: 2
60. కింది వాటిలో సరైంది ఏది?
1) దామోదర్ నది చోటానాగ్పూర్ పీఠభూమిలోని ‘టోరి’ అనే ప్రాంతంలో జన్మిస్తోంది
2) చంబల్ నది మధ్యప్రదేశ్‌లోని ‘మౌ’ అనే ప్రదేశంలో జన్మిస్తోంది
3) పెన్నా నది కర్ణాటకలో నంది దుర్గ కొండల్లో జన్మిస్తోంది
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
Tags
- indian Geography
- Indian Geography Quiz
- Indian Geography Quiz in Telugu
- Indian Geography Quiz with Answers
- Indian Geography MCQs
- General Knowledge
- GK Quiz on Indian Geography
- Indian Geography Quiz Questions and Answers MCQs
- Indian Geography Quiz Questions and Answers
- geography gk questions with answers
- Geography of India Quiz
- indian geography bit bank
- indian geography bits in telugu
- indian geography study material
- indian geography syllabus
- indian geography guidance
- Competitive Exams
- Current affairs Quiz in Telugu
- APPSC
- TSPSC
- groups exams
- geography quiz
- sakshieducation quiz