TSPSC Paper Leak: ఒకరికి తెలియకుండా మరొకరికి.. పేపర్‌ను విక్రయించుకుంటూ పోయిన నిందితులు?
15కు చేరిన అరెస్టుల సంఖ్య
పేపర్ లీక్ కేసులో అరెస్టుల సంఖ్య 15కి చేరింది. మొదట ఈ కేసులో ఒకేసారి తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ తొమ్మిది మంది సిట్ విచారణలో ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆపై మరో ఇద్దరినీ, తాజాగా తిరుపతయ్యను అరెస్ట్ చేసింది సిట్. డాక్యా నాయక్ నుంచి తిరపతయ్య ఏఈ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.
చదవండి: రద్దైన పరీక్షల రీషెడ్యూలు ఇలా.. మే నెలలో..!
100 మార్కులు వచ్చిన వారందరినీ...
ఇదిలా ఉంటే.. సిట్ ఇవాళ నిందితులను సిట్ మళ్లీ కస్టడీలోకి తీసుకోనుంది. దీంతో మరిన్నిపేర్లు బయటపడొచ్చని, అరెస్టులు జరగొచ్చని అర్థమవుతోంది. గ్రూప్ -1(Group 1) ప్రిలిమ్స్‌లో(రద్దైంది) 100కుపైగా మార్కులు వచ్చినవాళ్లను సిట్ పిలిచి విచారిస్తున్నట్లు సమాచారం. వాళ్లకు 15 అంశాలతో కూడిన ప్రశ్నావళి రూపొందించి సమాధానాలు ఇవ్వాలని కోరుతోందని తెలుస్తోంది.