AP News: రెండు నెలల్లో వైజాగ్ రాజధాని... టార్గెట్ ఐటీ హబ్
Sakshi Education
ఏపీకి కాబోయే పరిపాలన రాజధాని విశాఖపట్నం గురించి ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు నెలల్లో విశాఖ ఏపీకి పరిపాలన రాజధాని కాబోతోందని, ఏదేమైనా ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ఉద్ఘాటించారు.
విశాఖలో శనివారం రెండో రోజు ఇన్ఫినిటి వైజాగ్ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ‘‘దేశంలోని ధనిక నగరాల్లో విశాఖ తొమ్మిదవ స్థానంలో ఉంది. త్వరలో అదాని డేటా సెంటర్‌ను ప్రారంభిస్తాం. విశాఖను ఐటీ హబ్ చేయడమే మా లక్ష్యం’’ అని ఆయన ప్రకటించారు. ఈ సదస్సులో మంత్రి అమర్నాథ్‌తో పాటు పలువురు ఐటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
చదవండి: మీరు సూపర్‌గా వంట చేస్తారా... జీతం 4.5 లక్షలు ఇస్తారు..
చదవండి: గూగుల్‌కు మూడినట్లే... సవాల్ చేస్తోన్న చాట్‌జీపీటీ...
చదవండి: రేపే కానిస్టేబుల్ ఎగ్జామ్.. నిమిషం ఆలస్యమైనా ఇంట్లో కూర్చోవాల్సిందే
Published date : 21 Jan 2023 07:00PM