Vandebharath: వైఎస్సార్ ముందుచూపు... శ్రీ సిటీ నుంచే వందేభారత్ రైళ్ల విడిభాగాలు
ఈ కంపెనీ 2009 నుంచి పవన విద్యుత్, నిర్మాణ, రవాణా వంటి రంగాల్లోని పరిశ్రమలకు మిశ్రమ ఉత్పత్తులు, ప్రత్యేక ఆకృతులను తయారు చేస్తోంది.
వైఎస్సార్ ముందుచూపుతో...
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముందుచూపుతో చిత్తూరు జిల్లాలో శ్రీసిటీని నిర్మించారు. వైఎస్సార్ హయాంలో శ్రీసిటీలో తొలిసారిగా ఏర్పాటైన 8 పరిశ్రమల్లో బీఎఫ్‌జీ ఒకటి. బీఎఫ్‌జీ ఇంటర్నేషనల్‌కు బీఎఫ్‌జీ ఇండియా అనుబంధ సంస్థ.... ఇదే సంస్థ ఇప్పుడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్, దేశంలోని వివిధ మెట్రో ప్రాజెక్టులకు నాణ్యమైన, ప్రపంచస్థాయి ఎఫ్‌ఆర్‌పీ విడి భాగాలను అందిస్తోంది. శ్రీసిటీ సెజ్‌లో ఉన్న బీఎఫ్‌జీ ఇండియా 2009 నుంచి పవన శక్తి, నిర్మాణం, రవాణా వంటి వివిధ రంగాల్లో ఉన్న పరిశ్రమల కోసం ఎఫ్‌ఆర్‌పీ మిశ్రమ ఉత్పత్తులు, ప్రత్యేక ఆకృతుల నిర్మాణాలను తయారు చేస్తోంది.
చదవండి: ‘వందే భారత్ రైలు’.. దీని ప్రత్యేక సౌకర్యాలు ఇవే.. స్పీడుకు మాత్రం..
329 రకాల ఎఫ్‌ఆర్‌పీ ప్యానెల్స్
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్ట్‌లో రైలు పెట్టెలోని ఇంటీరియర్‌లు, టాయిలెట్ క్యాబిన్, ఇంజన్ ముందు భాగాన్ని బీఎఫ్‌జీ సంస్థే సరఫరా చేస్తోంది. ఇచ్చిన పనులను రికార్డు స్థాయిలో 10 నెలల్లో బీఎఫ్‌జీ పూర్తి చేసింది. ప్రాజెక్ట్‌ను ఆకర్షణీయంగా రూపొందించడానికి వివిధ రంగుల ప్యానెల్స్‌ను ఈ కంపెనీ తయారీ చేసింది. ఒక్కోరైలు కోసం 329 రకాల ఎఫ్‌ఆర్‌పీ ప్యానెల్స్ తయారయ్యాయి.
చదవండి: 10 లక్షల ఉద్యోగాలు.. ప్రతి నెలా మూడో వారంలో నోటిఫికేషన్
అన్ని మెట్రోలకు ఇక్కడి నుంచే...!
ఢిల్లీ మెట్రో రోలింగ్ స్టాక్(కోచెస్) కోసం బొంబార్డియర్ ట్రాన్స్‌పోర్టేషన్‌తో దాని వ్యూహాత్మక సరఫరాదారుగా ఇంటీరియర్స్, ఫ్రంట్ ఎండ్‌లు, డ్రైవర్ క్యాబ్‌లతో సహా ఎఫ్‌ఆర్‌పీ విడి భాగాలను బీఎఫ్‌జీ ఇండియా సరఫరా చేస్తోంది. చెన్నై, కొచ్చి, మెట్రో ప్రాజెక్ట్‌ల మెట్రో రోలింగ్ స్టాక్ కోసం సైడ్ వాల్స్, సెంట్రల్ సీలింగ్‌లు, లేటరల్ సీలింగ్‌లు, గ్యాంగ్‌వే విభజనలు, క్యాబ్ విభజనలతో సహా వివిధ భాగాలను శ్రీసిటీలోని ఆల్‌స్టోమ్ ఇండియాకు బీఎఫ్‌జీ సరఫరా చేస్తోంది.