Central Government Jobs : 10 లక్షల ఉద్యోగాలు.. ప్రతి నెలా మూడో వారంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇలా.. ఆగస్టు 15 లోపు..
ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ ఆదివారం ప్రారంభించబోయేది 6వ వందేభారత్ ట్రైన్... మొత్తంగా 100 వందే భారత్ రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించాము. ప్రతి ట్రైన్ ని ప్రధాని మోదీనే ప్రారంభిస్తారు. అటల్ బిహార్ వాజ్‌పేయ్ కలలను ప్రధాని సాకారం చేస్తున్నారు. మోదీ తక్కువ ధరలకు మెడిసిన్, వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. రూ.60 వేల కోట్లను స్వచ్ఛభారత్‌కు ఖర్చు చేస్తోంది. ప్రజల వద్దకే వైద్యం లక్ష్యంగా లక్షా యాభై వేల వెల్‌నెస్ సెంటర్స్‌ను కేంద్రం స్థాపించింది’’ అని చెప్పారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగ ఖాళీలను గుర్తించిందని... ప్రతి నెలా మూడో వారంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేస్తామన కిశన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే లక్షా యాభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు చెప్పారు. 2023 ఆగస్టు 15 లోపు 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.