Vande Bharat Train Details in Telugu : ‘వందే భారత్ రైలు’.. దీని ప్రత్యేక సౌకర్యాలు ఇవే.. స్పీడుకు మాత్రం..
జనవరి 15వ తేదీన సికింద్రాబాద్– విశాఖపట్నం రైలు ప్రారంభమైన విషయం తెలిసిందే. దక్షిణ మధ్యరైల్వే పరిధిలో మొత్తం ఆరు డివిజన్లు సికింద్రాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, హైదరాబాద్ ఉన్నాయి. అన్ని రూట్లలోనూ గరిష్ట వేగంతో వెళ్లేలా ఇటీవలే రైల్వేలైన్లను ఆధునీకరించారు. విభజన అనంతరం సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు తెలంగాణలో ఉన్నాయి. వందేభారత్ రైలు గరిష్ట వేగం 160 నుంచి 180 కి.మీలతో ప్రయాణించగలదు.
గరిష్ట.. కనిష్ట వేగం ఎంతంటే..?
ఈ రైలును మూడు డివిజన్లలోని పలు సెక్షన్లను పరిశీలిస్తే.. సామర్థ్యాన్ని బట్టి వేగం మారుతోంది. ఖాజీపేట– బల్లార్షా సెక్షన్‌లో 130 కి.మీ గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదని అధికారులు తెలిపారు. అదే సమయంలో అతి తక్కువగా మల్కాజిగిరి– మౌలాలి సెక్షన్లో కేవలం 30.కి.మీ స్పీడుకే పరిమితం కావడం గమనార్హం. అయితే, వేగంపై లైన్ అప్‌గ్రేడేషన్‌తోపాటు లెవెల్ క్రాసింగ్స్, రైల్ ట్రాఫిక్ కూడా ప్రభావం చూపుతుంది.
Railway Jobs: దక్షిణ మధ్య రైల్వేలో 4103 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ఈ రైలులోని సౌకర్యాలు ఇవే..
ఈ రైలుకు మొత్తం 16 ఏసీ బోగీలుంటాయి.. 1,128 సీట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆటోమేటిక్ డోర్స్, స్మోక్ అలారం, సీసీ టీవీ కెమెరాలు, బయో వ్యాక్యూమ్ టాయ్‌లెట్స్, సెన్సార్‌తో పనిచేసే నల్లాలు, ఫుట్‌రెస్ట్‌లు వంటి ఆధునిక సదుపాయాలున్నాయి. వందేభారత్ రైలు బరువు 392 టన్నులు. తయారీకి రూ.115 కోట్లు ఖర్చవుతోంది. వైఫై సదుపాయం ఉంటుంది. కవచ్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్, బ్యాక్టీరియా ఫ్రీ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, అన్ని కోచ్‌లలో రిక్లైనబుల్ సీట్లు, వీటిలో 32 ఇంచుల టెలివిజన్ సదుపాయం, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ యూనిట్, విశాలమైన డ్రైవర్ క్యాబిన్, హయ్యర్ ఫ్లడ్ ప్రొటెక్షన్ మొదలైన సౌకర్యాలు ఈ రైలులో ఉంటాయి. అలాగే మిగిలిన రైళ్లతో పోలిస్తే.. దీని నిర్వహణ పూర్తిగా భిన్నం. తొలి వందే భారత్ రైలు సర్వీసు 2019 ఫిబ్రవరి 15న ఢిల్లీ– వారణాసి మధ్య ప్రారంభమైంది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా మొత్తం ఏడు సర్వీసులు నడుస్తుండగా.. సికింద్రాబాద్– విజయవాడ మధ్య సర్వీసు ప్రారంభమైతే ఆ సంఖ్య ఎనిమిదికి చేరుకుంటుంది.
చదవండి: Railway Jobs: నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 2026 అప్రెంటిస్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ఈ రైలు ప్రయాణం ఇలా..
రూటు స్పీడు
☛ సికింద్రాబాద్– బల్లార్షా 130 కి.మీ.
☛ ఖాజీపేట–కొండపల్లి 130 కి.మీ.
☛ సికింద్రాబాద్– ఖాజీపేట 130 కి.మీ.
☛ మానిక్‌నగర్– విరూర్ (3వలైన్) 110 కి.మీ.
☛ మందమర్రి– మంచిర్యాల కి.మీ(3వలైన్) 110 కి.మీ.
☛ మంచిర్యాల– పెద్దంపేట (3వలైన్) 100 కి.మీ.
☛ పెద్దంపేట– రాఘవపురం (3వ లైన్) 110 కి.మీ.
☛ రాఘవపురం– కొలనూరు–పొత్కపల్లి (3వలైన్) 90 కి.మీ.
☛ బిజిగిరి షరీఫ్– ఉప్పల్ (3వలైన్) 100 కి.మీ.
☛ పెద్దపల్లి– కరీంనగర్ 100 కి.మీ.
☛ కరీంనగర్– జగిత్యాల(లింగంపేట) 90 కి.మీ.
☛ జగిత్యాల(లింగంపేట)– నిజామాబాద్ 100 కి.మీ
☛ మేడ్చల్– మనోహరాబాద్ 110 కి.మీ
☛ మల్కాజిగిరి– మౌలాలి కార్డ్‌లైన్ సెక్షన్లలో 30 కి.మీ.
స్పీడు రైళ్లు నడపాలనేది ఎప్పటి నుంచో భారతీయ రైల్వే ఆలోచన. 2015లో మోడ్రన్ హై స్పీడ్ రైలుకు రూపకల్పన చేసేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. దానికి స్పందన రాకపోవడంతో 2017లో దేశీయంగానే సెమీ హైస్పీడ్ రైళ్లు తయారీ చేయాలని ప్రభుత్వం దృఢంగా నిశ్చయించుకొంది. గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించడమే లక్ష్యంగా చెన్నైలోని ఐసీఎఫ్‌లో ‘ట్రైన్-18’ ప్రాజెక్టు పట్టాలెక్కింది. తొలి టెస్ట్ రన్ నిర్వహించగా 180 కి.మీ వేగంతో ఈ రైలు ప్రయాణించింది. అయితే దేశంలోని ఏ ట్రాక్‌లూ ఆ వేగాన్ని తట్టుకునే స్థాయిలో లేకపోవడంతో ఈ రైళ్ల వేగాన్ని 130 కి.మీకు పరిమితం చేశారు. ‘ట్రైన్-18’కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్(1.0)గా నామకరణం చేశారు. 2019 ఫిబ్రవరి 15న దిల్లీ - వారణాసి మధ్య తొలి రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దీనిలో 762 కిలోమీటర్ల ప్రయాణానికి గానూ ఛైర్‌కార్ సీసీ క్లాస్ ధరను రూ.1,440గా నిర్దేశించారు. 2022 సెప్టెంబర్ 30న గాంధీనగర్ - ముంబయి వందేభారత్ 2.0 ట్రైన్‌ను ప్రారంభించారు.
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్