Skip to main content

Mission Divyastra Quiz (March 12th Current Affairs): పోటీ పరీక్షలకు అగ్ని-5 గురించి తప్పకుండా నేర్చుకోవాల్సిన ప్రశ్నలు ఇవే!

మన అమ్ములపొదిలోకి తిరుగులేని ‘దివ్యాస్త్రం’ చేరింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) మరో అద్భుతం చేసింది. ఒకటికి మించిన లక్ష్యాలను ఒకేసారి అత్యంత కచ్ఛితత్వంతో ఛేదించగల అత్యాధునిక ఖండాంతర అణు క్షిపణి అగ్ని–5ను తొలిసారి ప్రయోగించింది.
Current Affairs Quiz top 15 gk quiz questions
Current Affairs Quiz

5,000 నుంచి 5,800 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను అగ్ని–5 ఛేదించగలదు. తక్కువ బరువున్న వార్‌హెడ్లను అమర్చే పక్షంలో క్షిపణి రేంజ్‌ ఏకంగా 8,000 కి.మీ. దాకా పెరుగుతుంది! ‘మిషన్‌ దివ్యాస్త్ర’ పేరిట జరిగిన ఒడిశా తీర సమీపంలోని అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి సోమవారం జరిగిన ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు.
 

Published date : 13 Mar 2024 01:42PM

Photo Stories