Skip to main content

AP RGUKT 2021: ఆర్జీయూకేటీ సెట్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

RGUKT Results-Suresh

సాక్షి, ఒంగోలు: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని 4 ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఆర్జీయూకేటీ సెట్‌–2021 ఫలితాలు అక్టోబర్‌ 6న విడుదలయ్యాయి. ఒంగోలులోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ (ఎస్‌ఎస్‌ఎన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌)లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్జీయూకేటీ సెట్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు. సెప్టెంబర్‌ 26న పరీక్ష నిర్వహించగా.. రికార్డు సమయంలో 10 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం.

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌


డౌన్‌లోడ్‌ వయా ఆపిల్‌ ఐ స్టోర్‌

Published date : 06 Oct 2021 01:22PM

Photo Stories