Skip to main content

TS CPGET Results 2024 Release Date : సీపీగెట్-2024 ఫలితాలు విడుదల..నేడే .. ఫ‌లితాల కోసం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (CPGET )- 2024 ఫలితాలను ఆగ‌స్టు 9వ తేదీన (శుక్రవారం) మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేయ‌నున్నారు.
TS CPGET Results 2024  CPGET 2024 results announcement  Telangana PG entrance exam results  CPGET 2024 results release date and time  CPGET 2024 results on August 9 Telangana universities PG admission results 2024

ఈ ఫ‌లితాల‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుద‌ల చేయ‌నున్నారు. ఈ TS CPGET-2024  ఫ‌లితాల‌ను ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.com లో చూడొచ్చు. ఈ ప్రవేశాలకు సంబంధించిన రాతపరీక్షలను కంప్యూటర్ బేస్డ్ విధానంలో జులై 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహించారు. 

ఈ 45 కోర్సులకు మొత్తం..
మొత్తం 41 పీజీ కోర్సులు, నాలుగు ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు ఈ రాతపరీక్షలను నిర్వహించారు. ఈ 45 కోర్సులకు 73,342 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 64,765 మంది పరీక్షలకు హాజరయ్యారు.ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా యూనివర్సిటీతో పాటు జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీల్లో పీజీ కోర్సులు ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంఎల్ఐసీ, ఎంఈడీ, ఎంపీఈడీతో పాటు పలు కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించనున్నారు.

TS CPGET Results 2024 పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 09 Aug 2024 09:36AM
PDF

Photo Stories