TS CPGET Results 2023 Released : TS CPGET ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..
TS CPGET పరీక్షలు జూన్ 30 నుంచి జులై 10 వరకు సీబీటీ ద్వారా నిర్వహించగా.. ఈ పరీక్షలకు మొత్తం 69,439 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.. వీరిలో 60,443 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ఇచ్చే CP GET 2022 Results - Download CP GET Results Rank Card, Marks List- Sakshieducation.com డైరెక్ట్ లింక్ ద్వారా చూడొచ్చు.
45 కోర్సుల్లో..
రాష్ట్రంలోని ఉస్మానియా వర్సిటీ, కాకతీయ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, పాలమూరు వర్సిటీ, మహాత్మాగాంధీ వర్సిటీ, శాతవాహన వర్సిటీ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ హైదరాబాద్‌తో కలిపి మొత్తం 8 యూనివర్సిటీల్లో పీజీ, ఇంటిగ్రేటెడ్, పీజీ డిప్లమా కోర్సులు కలిపి 45 కోర్సుల్లో ప్రవేశాల కోసం CPGET పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
☛ TS CPGET Results 2023 Direct Link (Click Here)
నచ్చిన కోర్సు..
రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది ఇంతే సంఖ్యలో సీట్లున్నా, చేరిన వారి సంఖ్య 22,812 మాత్రమే. వీరిలోనూ 16,163 (71%) మహిళలు, 6,649 (29%) పురుషులు చేశారు. డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఆఖరుకు ఎంబీబీఎస్, బీటెక్ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఎంఏ తెలుగు, ఇంగ్లిష్ కోర్సులకు ఏ గ్రూపుతో డిగ్రీ చేసినా అర్హులే. నేషనల్ ఇంటిగ్రేషన్ కోటాను 5% నుంచి 20%కి పెంచారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు చేరేందుకు ముందుకొస్తే సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేస్తారు. ఆన్‌లైన్, డిస్టెన్స్ మోడ్‌లోనూ వర్సిటీ నుంచి పీజీ కోర్సులు చేసే అవకాశం కల్పిస్తున్నారు.