ఏపీలోని పలు వర్సిటీల్లో పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఏపీఆర్‌సెట్–2021 దరఖాస్తు గడువును నవంబర్ 7 వరకు పొడిగించినట్లు ఏపీఆర్‌సెట్–2021 కనీ్వనర్ ప్రొఫెసర్ వి.శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.
ఏపీఆర్‌సెట్–2021 దరఖాస్తు గడువు పెంపు
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు దరఖాస్తు గడువు అక్టోబర్ 31తో ముగియాల్సి ఉన్నా అభ్యర్థుల వినతి మేరకు మరో వారం పాటు గడువు పెంచినట్లు తెలిపారు. పరీక్షకు దరఖాస్తు చేసే ఓసీ అభ్యర్థులు రూ.1,500, బీసీలు రూ.1,300, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1,000 ఫీజు చెల్లించాలన్నారు. నవంబర్ 8 నుంచి 12 వరకు రూ.2,000, 13 నుంచి 15 వరకు రూ.5,000 అపరాధ రుసుముతో దరఖాస్తు చేయవచ్చని పేర్కొన్నారు.