APSET: ఏపీ సెట్‌కు ప్రాథమిక కీ విడదల
Sakshi Education
రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్–2021 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 80.72 శాతం మంది హాజరయ్యారు.
పరీక్షను అక్టోబర్ 31న ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 78 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. పరీక్షకు మెత్తం 36,667 మంది దరఖాస్తు చేయగా 29,596 మంది హాజరైనట్లు ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో పరీక్ష కేంద్రాలను ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాస రావు పరిశీలించారు. నవంబర్ 1న ఏపీ సెట్ వెబ్‌సైట్‌లో ప్రాథమిక కీ అందుబాటులో ఉంచనున్నట్లు శ్రీనివాసరావు చెప్పారు.
చదవండి:
Published date : 01 Nov 2021 04:13PM