Dental: డెంటల్ యాజమాన్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలోని డెంటల్ కాలేజీల్లో యాజమాన్య కోటా ఎండీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీచేసింది.
ఎండీఎస్ ప్రవేశాల దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో మొదటి విడత వెబ్ ఆప్షన్లకు యూనివర్సిటీ అక్టోబర్ 29న నోటిఫికేషన్ విడుదల చేసింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి 31 మధ్యాహ్నం ఒంటిగంట గంట వరకు తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కాలేజీల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. మెరిట్ జాబితా, కాలేజీల వారీగా సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని, మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in ను సందర్శించాలని పేర్కొంది.
చదవండి:
SVV: ఎస్‌వీవీ వర్సిటీకి బీవోఎం
Published date : 30 Oct 2021 05:00PM