Skip to main content

SVV: ఎస్‌వీవీ వర్సిటీకి బీవోఎం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి బోర్డు ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(బీవోఎం)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అక్టోబర్‌ 29న ఉత్తర్వులు జారీ చేశారు.
SVV
ఎస్‌వీవీ వర్సిటీకి బీవోఎం

బీవోఎంలో శాస్త్రవేత్తల విభాగం నుంచి మరింగంట రంగనాథం (కృష్ణా జిల్లా), అకడమిక్‌ కౌన్సిల్‌ నుంచి డాక్టర్‌ ఆదిలక్ష్మమ్మ, ఎంపీ మాలకొండయ్య, వైకుంఠరావు, ప్రజాప్రతినిధుల నుంచి అనంతపురం ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి (పాతపట్నం), ఎన్.ధనలక్ష్మి (రంపచోడవరం), విడదల రజిని (చిలకలూరిపేట), ఆదర్శ రైతుల నుంచి టి.నాయనాథ్, కె.స్వాతి, వాసుపల్లి జానకిరామ్, స్టేట్‌ వెటర్నరీ కౌన్సిల్‌ నుంచి జి.శ్రీనివాసరెడ్డి (వైఎస్సార్‌ జిల్లా), లైవ్‌స్టాక్‌/పౌల్ట్రీ/ఫిషరీస్‌ పరిశ్రమ రంగాల నుంచి విజయకుమారి (వైఎస్సార్‌ జిల్లా)లతో పాటు కె.విజయ (శ్రీజ మహిళా ప్రొడ్యూసర్స్‌ లిమిటెడ్‌)లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి పదవీ కాలం మూడేళ్లు.

చదవండి: 

AITT: ఏఐటీటీ టాపర్స్‌కు సీఎం అభినందనలు

వర్క్‌ ఫ్రం విలేజ్‌

Published date : 30 Oct 2021 03:52PM

Photo Stories