Skip to main content

Telangana : బీహెచ్‌ఎంఎస్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుల చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని ప్రైవేటు హోమియోపతి వైద్య కళాశాలల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ హోమియోపతిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ (బీహెచ్‌ఎంఎస్‌) యాజమాన్య సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం డిసెంబ‌ర్ 10వ తేదీన (శనివారం) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ సీట్లకు నీట్‌–2022 అర్హత సాధించిన అభ్యర్థులు డిసెంబ‌ర్ 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత వాటి పరిశీలన, ఆప్షన్ల నమోదుకు వర్సిటీ మరో నోటిఫికేషన్‌ జారీ చేస్తుందని, మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in ను చూడాలని పేర్కొంది.

Published date : 12 Dec 2022 06:15PM

Photo Stories