Skip to main content

MBBS And BDS Admissions: ఎంబీబీఎస్, బీడీఎస్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే

MBBS And BDS Admissions

డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్..2024-25 విద్యా సంవత్సరానికి గాను ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.ఈ నోటిఫికేషన్‌ కింద యూనివర్సిటీ పరిధిలోని ఎంబీబీఎస్‌, డెంటల్‌ మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు.నీట్‌ యూజీ 2024 అర్హత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్ధులు ఆగస్టు 9వ తేదీ నుంచి ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ (బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు, ఓసీ(పీడబ్ల్యూడీ) అభ్యర్థులకు సైన్స్ సబ్జెక్టులలో 45 శాతం మార్కులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు సైన్స్ సబ్జెక్టులలో 45 శాతం మార్కులు ఉండాలి. నీట్ యూజీ 2024 ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

అప్లికేషన్‌ ఫీజు: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు దరఖాస్తు చేసుకునే జనరల్, బీసీ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు రూ. 2950/- (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ. 2360/- చెల్లించాల్సి ఉంటుంది) అభ్యర్థులు ఆన్‌లైన్‌లో డెబిట్‌ కార్డ్‌ లేదా క్రెడిట్‌ కార్డు ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

JNTU Mega Job Fair 2024: నిరుద్యోగులకు బంపర్‌ఆఫర్‌.. జేఎన్‌టీయూలో మెగా జాబ్‌ఫెయిర్‌


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 16వ తేదీ వరకు(లేట్‌ ఫీజుతో ఆగస్టు 19 వరకు అవకాశం)

కావాల్సిన ధ్రువపత్రాలు 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు కావాల్సిన ధ్రువపత్రాలన్నీ పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో కేబీల్లోనే ఉండాలి.  
► నీట్‌ ర్యాంకు కార్డు 
► ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్‌ మార్కుల మెమోలు 
► 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికెట్లు 
► టీసీతోపాటు కులధ్రువీకరణ పత్రం,మైనార్టిలు, ఈడబ్ల్యూఎస్‌లకు సంబంధిత శాఖలు జారీ చేసిన ధ్రువపత్రాలు 
► ఆధార్‌ కార్డు, లోకల్‌ సర్టిఫికెట్‌ కార్డు, పాస్‌పోర్టు ఫొటో, సంతకం, నివాస ధ్రువీకరణ పత్రం వంటివన్నీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. 

అభ్యర్థులు సంప్రదించాల్సిన నంబర్లు  
► సాంకేతిక సమస్యలకు: 9000780707 
► సలహాలు, సందేహాలకు: 8978780501 & 7997710168

Published date : 09 Aug 2024 06:01PM

Photo Stories