Skip to main content

Horticulture Diploma Admissions : ఈ యూనివ‌ర్సిటీలో హార్టీక‌ల్చ‌ర్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

సిద్ధిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్శిటీ 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Mulugu campus of Sri Konda Laxman Telangana State Horticultural University  Admissions in Horticulture Polytechnic Diploma course for two years   Sri Konda Laxman Telangana State Horticultural University

ప్రభుత్వ, ప్రైవేట్‌ అనుబంధ పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో 60 శాతం సీట్లను గ్రామీణ విద్యార్థుల­కు, 40 శాతం సీట్లను పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.

»    కోర్సు: డిప్లొమా ఇన్‌ హార్టికల్స్‌ (ఇంగ్లిష్‌ మీడియం)
»    సీట్లు: యూనివర్శిటీ పాలిటెక్నిక్‌లు–120, అనుబంధ పాలిటెక్నిక్‌లు–200.
»    అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. లేదా ఇంటర్మీడియట్‌ ఫెయిల్‌ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ పాలిసెట్‌–2024 ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 31.12.2024 నాటికి 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: పాలిసెట్‌–2024 ర్యాంక్, పదో తరగతి మార్కుల ఆధారంగా సీటు కేటాయిస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
»    దరఖాస్తు ఫీజు: ఇతరులకు రూ.1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600. 
»    దరఖాస్తు ప్రారంభతేది: 15.06.2024.
»    దరఖాస్తులకు చివరితేది: 15.07.2024.
»    వెబ్‌సైట్‌: www.skltshu.ac.in

Indian Coast Guard : భారత తీరరక్షక దళంలో నావిక్, యాంత్రిక్‌ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు..

Published date : 24 Jun 2024 11:25AM

Photo Stories