Skip to main content

Indian Coast Guard : భారత తీరరక్షక దళంలో నావిక్, యాంత్రిక్‌ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు..

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీర రక్షక దళం.. కోస్ట్‌ గార్డ్‌ ఎన్‌రోల్డ్‌ పర్సనల్‌ టెస్ట్‌ (సీజీఈపీటీ)–01/2025 బ్యాచ్‌ ద్వారా నావిక్‌(జనరల్‌ డ్యూటీ), యాంత్రిక్‌ పోస్టుల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Mechanic recruitment advertisement  Indian Coast Guard  Applications for the posts of Navik and Mechanic in Indian Coast Guard

»    మొత్తం పోస్టుల సంఖ్య: 320
పోస్టుల వివరాలు
»    నావిక్‌(జనరల్‌ డ్యూటీ): 260 (రీజియన్‌/జోన్‌ వారీ ఖాళీలు: నార్త్‌–77, వెస్ట్‌–66, నార్త్‌ ఈస్ట్‌–68, ఈస్ట్‌–34, నార్త్‌ వెస్ట్‌–12, అండమాన్‌–నికోబార్‌–03.
»    యాంత్రిక్‌(మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌): 60.
»    అర్హత: నావిక్‌ పోస్టులకు 12వ తరగతి(మ్యాథ్స్‌/ఫిజిక్స్‌), యాంత్రిక్‌ పోస్టులకు పదో తరగతి లేదా 12వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 18 నుంచి 22 ఏళ్ల మ­ధ్య ఉండాలి. 01.03.2003 నుంచి 28.02.2007 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది.
»    వేతనం: నెలకు నావిక్‌ పోస్టులకు రూ.21,700; యాంత్రిక్‌ పోస్టులకు రూ.29,200.
»    ఎంపిక విధానం: స్టేజ్‌–1, స్టేజ్‌–­2, స్టేజ్‌–3, స్టేజ్‌–4 పరీక్షలు, వై­ద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 13.06.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03.07.2024.
»    పరీక్ష తేదీలు/ఈ–అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: స్జేజ్‌–1: సెప్టెంబర్‌ 2024; స్టేజ్‌–2: నవంబర్‌ 2024; స్టేజ్‌–3: ఏప్రిల్‌ 2024.
»    వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.cdac.in/cgept

Government Schemes : బీటెక్ కోర్సు ఎంపికపై అవ‌గాహ‌న‌.. దీనికే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు!

Published date : 24 Jun 2024 11:12AM

Photo Stories