Skip to main content

Good News for Youth : యువ‌త‌కు గుడ్‌న్యూస్‌.. భార‌త సైన్యంలో చేరేందుకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం.. చివ‌రి తేదీ..!

భారత సైన్యంలోకి యువకులు చేరడానికి అగ్నివీర్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని భారత వైమానిక దళం నాన్‌ కమిషన్‌డ్‌ ఆఫీసర్‌ ఎన్‌. సందీప్‌ చెప్పారు..
Agniveer notification for youth to join Indian Army

బాపట్ల: అగ్నివీర్‌ వాయుసేనలో చేరడానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భారత వైమానిక దళం నాన్‌ కమిషన్‌డ్‌ ఆఫీసర్‌ ఎన్‌. సందీప్‌ తెలిపారు. అగ్నివీర్‌ వాయుసేనపై అనుబంధ శాఖల అధికారులతో శనివారం స్థానిక కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. భారత సైన్యంలోకి యువకులు చేరడానికి అగ్నివీర్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఆయన చెప్పారు. ఈనెల 8వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు.

Vocational Inter students : ఒకేషనల్‌ ఇంటర్‌ విద్యార్థులు అప్రెంటీస్‌ చేయాలి

2004 జూలై 3 నుంచి 2008 జనవరి 3వ తేదీ మధ్యలో జన్మించిన వారే అర్హులని పేర్కొన్నారు. అక్టోబర్‌ 18వ తేదీన రాత పరీక్ష ఉంటుందన్నారు. పూర్తి వివరాలు వెబ్‌ సైట్‌ లో పొందవచ్చని సూచించారు. బాపట్ల జిల్లాలోని 149 కళాశాలలో యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. నాలుగు సంవత్సరాల పాటు సైన్యంలో పనిచేయడం ద్వారా కలిగే ప్రయోజనాల్ని యువతకు వివరించాలని తెలిపారు. సమావేశంలో ఇంటర్మీడియట్‌ బోర్డు ఆర్‌ఐఓ ఎర్రయ్య, ఎస్సీ సంక్షేమ సాధికారిత అధికారి రాజదిబోరా, కలెక్టరేట్‌ బీ–సెక్షన్‌ పర్యవేక్షకులు మల్లీశ్వరి, అనుబంధశాఖల అధికారులు పాల్గొన్నారు.

Powerlifting: పవర్‌లిఫ్టింగ్‌లో తెలుగ‌మ్మాయికి స్వర్ణ పతకం!

Published date : 08 Jul 2024 05:53PM

Photo Stories