Vocational Inter students : ఒకేషనల్ ఇంటర్ విద్యార్థులు అప్రెంటీస్ చేయాలి
మచిలీపట్నం: ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సు రెండు సంవత్సరాలు పూర్తి చేసిన విద్యార్థులు అప్రెంటీస్ చేసేలా అధ్యాపకులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్మీడియెట్ వృత్తి విద్యా శాఖాధికారి పీబీ సాల్మన్‌రాజు తెలిపారు. లేడీయాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శనివారం వృత్తి విద్యా అధ్యాపకుల సమావేశం నిర్వహించారు. సాల్మన్‌రాజు మాట్లాడుతూ ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థులు గుడివాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 8వ తేదీ నిర్వహిస్తున్న అప్రెంటీస్ మేళాలో పాల్గొనేలా చూడాలని కోరారు.
Also Read: ఏపీలో 400కు పైగా ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో కొలువులు
ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఎప్పటిలానే ఏడాది పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అప్రెంటీస్ చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ ఏవో సందీప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ కార్యక్రమం చేపట్టిందని పేర్కొన్నారు. రాబోయే మూడు నెలల్లో స్కిల్ ట్రైనింగ్ ఉంటుందన్నారు. దీనిని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.