Skip to main content

Agniveer Notification : అగ్నివీర్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఈ వ‌య‌స్సు గ‌ల‌వారే అర్హులు!

Notification from Commanding Officer-12 Airmen Centre  Air Force Recruitment for Youth in Srikakulam  Agniveer Central Government Job Opportunity  Agniveer notification released with age limit of male and female candidates

శ్రీకాకుళం: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అగ్నివీర్‌ నోటిఫికేషన్‌ వెలువడిందని యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ తెలిపారు. భారత ప్రభుత్వం నుంచి కమాండింగ్‌ ఆఫీసర్‌–12 ఎయిర్‌మెన్‌ సెంటర్‌, సికింద్రాబాద్‌ వారి నుంచి అగ్నివీర్‌ నోటిఫికేషన్‌ వెలువడినట్టు పేర్కొన్నారు. స్త్రీ / పురుషులు ఇరువురూ అర్హులేనని 2004 జూలై 3 నుంచి 2008 జనవరి 3 మధ్య జన్మించి ఉండాలని స్పష్టంచేశారు. ఇంటర్మీడియెట్‌ ఎంపీసీలో 50 శాతం మా ర్కులతో ఉత్తీర్ణులై, ఇంగ్లిష్‌ సబ్జెక్టులో 50 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు.

India-Russia Annual Summit: ఇండో–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు.. పాల్గొననున్న ప్రధాని మోదీ

లేదా 50 మార్కులతో పాలిటెక్నిక్‌ ఉత్తీర్ణులై, ఇంగ్లిష్‌లో 50 మార్కులతో పాసైనవారు అర్హులని తెలిపారు. లేదా ఇంటర్‌ ఒకేషనల్‌ చదివి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన స్త్రీ, పురుషులు ఈ నెల 8 నుంచి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను agnipathvayu.cdac.in అనే వెబ్‌పోర్టల్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కొత్తలంక సుధ సూచించారు.

Post Graduation Courses : డిగ్రీ కళాశాలలో ఈ రెండు పీజీ కోర్సులు మంజూరు.. ద‌రఖాస్తుకు వీరే అర్హ‌లు!

Published date : 08 Jul 2024 03:58PM

Photo Stories