Renewal of Faculty : డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల కాంట్రాక్టు పునరుద్ధరించడానికి దరఖాస్తులు.. అర్హత వీరికే!
మధురానగర్: ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 2024–2025 విద్యా సంవత్సరానికి జోన్ 2 ప్రభుత్వ, ప్రైవేట్ ఓరియంటల్, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల కాంట్రాక్టు పునరుద్ధరించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ, ప్రైవేట్ ఓరియంటల్, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో 2023–2024లో ఏప్రిల్ 30వ తేదీ నాటికి కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేస్తున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు.
Santhosh Reddy Rokkam: లక్షల్లో వేతనం.. లగ్జరీ జీవితం.. ఎంటెక్.. మెకానిక్
2023–24 విద్యా సంవత్సరంలో పని చేసిన, ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో స్థానభ్రంశం చెందిన వారు ఈ విద్యా సంవత్సరంలో పని చేయడానికి కాంట్రాక్టు అధ్యాపకులు ఈనెల 9వ తేదీలోపు సంబంధిత కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కళాశాల ప్రిన్సిపాల్‌లు తమ ఐడీ కళాశాల ప్రిన్సిపాల్‌కు సమర్పించాలన్నారు. కాంట్రాక్టు పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 15వ తేదీన జిల్లా ఎంపిక కమిటీ ముందు హాజరు కావాలన్నారు. కాంట్రాక్టు రెన్యువల్ అయిన అధ్యాపకులు ఈనెల 16న ఆయా కళాశాలల్లో కాంట్రాక్టు బాండ్ సమర్పించాలని వివరించారు.
Anganwadi Workers Retirement: అంగన్‌వాడీల రిటైర్మెంట్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్?
Tags
- Degree College
- Lecturers
- renewal of faculty
- contract based jobs
- Degree Lecturers
- new academic year
- registrations
- renewal of contract
- degree faculty renewal
- govt and private degree colleges
- Education News
- Sakshi Education News
- Madhuranagar ID College
- Dr. K. Bhagyalakshmi statement
- teacher contract renewal 2024
- government colleges NTR district
- private colleges academic year
- aided degree colleges Zone 2
- sakshieducationlatest news