Skip to main content

Open Inter Evaluation: నేడు ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షల మూల్యాంకనం ప్రారంభం..

ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్థుల పరీక్ష పత్రాల మూల్యాంకనం నేడు ప్రారంభం కానుంది. అందుకు చేసిన ఏర్పాట్లు, నియమించిన ఉపాధ్యాయుల గురించి వివరణ..
Evaluation of exam papers of open intermediate in AP

అనంతపురం: సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్‌) ఇంటర్‌ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్‌) నేడు ప్రారంభం కానుంది. ఇందుకోసం అనంతపురం నగరంలోని కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ బాలికల కళాశాలలో క్యాంపు ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు క్యాంపు కొనసాగుతుందని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందనాయక్‌ తెలిపారు.

Freedom Prize: అలెక్సీ నవల్నీ, యులియా నవల్నాయకు ఫ్రీడమ్ ప్రైజ్

ఎగ్జామినర్ల నియామకాల్లో నిబంధనలకు పాతర

మూల్యాంకనంలో ఎగ్జామినర్లే కీలకం. అలాంటి వీరి నియామకాల్లో విద్యాశాఖ అధికారులు నిబంధనలకు పాతరేశారు. తప్పనిసరిగా ఆయా సబ్జెక్టుల్లో కనీసం మూడేళ్ల బోధన అనుభవం ఉన్నవారిని ఎగ్జామినర్లుగా నియమించాల్సి ఉంది. అయితే అనుభవం లేనివారిని, సబ్జెక్టుతో సంబంధం లేకపోయినా తమకు అనుకూలమైన వారిని నియమించారని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ముఖ్యంగా కామర్స్‌ సబ్జెక్టుకు కొందరు స్కూల్‌ అసిస్టెంట్‌ హిందీ, ఇంగ్లిష్‌ టీచర్లను నియమించారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ విద్యార్హత ఉన్నవారిని తీసుకున్నామని అధికారులు చెబుతున్నా.. హిందీ, ఇంగ్లిష్‌ టీచర్లు వారి సబ్జెక్టుల్లో కాకుండా కామర్స్‌లో మూడేళ్లు ఎక్కడ బోధించారనేది చెప్పాల్సి ఉంది. ఈ విషయంపై గోవిందనాయక్‌ మాట్లాడుతూ స్పాట్‌ ప్రారంభ సమయంలో మరోమారు పరిశీలించి ఎక్కడైనా అలా జరిగి ఉంటే వారిని తొలగించనున్నట్లు తెలిపారు.

Admissions at SPAV: ఎస్‌పీఏవీ, విజయవాడలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. షార్ట్‌లిస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

Published date : 12 Apr 2024 10:22AM

Photo Stories