AP Intermediate Results 2024: నేడే ఇంటర్ ఫలితాల విడుదల
Sakshi Education
నేడే ఇంటర్ ఫలితాల విడుదల
AP Intermediate Results 2024: నేడే ఇంటర్ ఫలితాల విడుదల
కర్నూలు : ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలను నేడే(శుక్రవారం) విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. గత నెల 1 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలోని 69 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మొదటి సంవత్సరం 22,239 ద్వితీయ సంవత్సరం 25,173 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గత నెల 18న ప్రారంభమైన మూల్యాంకనం అదేనెల 31వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు మూల్యాంకనానికి హాజరు కాకపోవడంతో నాలుగు రోజులు ఆలస్యంగా ఈనెల 4వ తేదీతో ఈ కార్యక్రమం ముగిసింది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో గతేడాది కంటే ముందుగానే పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.
ఏపీ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షల 2024 ఫలితాలనుwww.sakshieducation.comలో చూడొచ్చు.